08/9/18 3:41 PM

చివరకు.. మోడీనే విజయం సాధించారు..!

Untitled-1 copy

తీవ్ర ఉత్కంఠ రేపిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు జరగలేదు. విపక్షాలన్నీ ఏకమైనా ఏమీ చేయలేకపోయాయి. ఇక ఏ ప్రాంతీయ పార్టీలైతే బీజేపీని దెబ్బకొడతాయని అనుకున్నారో అవే ప్రాంతీయ పార్టీలు మోడీని ఆదుకున్నాయి. డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే కూటమిలోని జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత.. రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఎన్నికను నిర్వహించారు.

 

ఉపాధ్యక్ష పదవికి నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. అయితే విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారు.

 

ఇందులో హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 89 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 230 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదని కౌంటింగ్ నంబర్ బోర్డు తెలిపింది. ఆపై హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని వెంకయ్య నాయుడు ప్రకటించారు.

 

కొంతమంది తాము పొరపాటు పడ్డామని, మరికొందరు ఓటు వేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసారి డివిజన్ చేశారు. అప్పుడు హరివంశ్ కు 125 ఓట్లు, హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా, ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ గెలుపును వెంకయ్యనాయుడు ఖరారు చేయగా, ఆపై పలువురు సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ ఓటువేయగా, వైసీపీ మాత్రం ఓటింగ్‌ కు దూరంగా ఉంది. రాజ్యసభలో అధికార పక్షానికి తగినంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్డీఏ కూటమికి 89 మంది సభ్యులు ఉండగా, బీజేడీ, అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ పార్టీల ఓట్లతో హరివంశ్ నారాయణ్ సింగ్ గెలుపు సునాయాసమైంది. అంతకు ముందు విజయంపై ఇరు పక్షాలూ ధీమా వ్యక్తం చేశాయి. బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న హరివంశ్ సభ్యత్వం 2020తో ముగియనుంది. సరిపడేంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

 

ఇక ఏ ప్రాంతీయ పార్టీలైతే బీజేపీని దెబ్బకొడతాయని అనుకున్నారో అవే ప్రాంతీయ పార్టీలు మోడీని ఆదుకున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా లేని టీఆర్ఎస్ ఆఖరి క్షణంలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు పలికింది. ఆయనకు అనుకూలంగా టీఆర్ఎస్ తరఫున రాజ్యసభలో ఉన్న ఆరుగురు ఎంపీలూ ఓటు వేశారు.

 

అంతకుముందు ఓటింగ్ లో పాల్గొనరాదని కేసీఆర్ తన ఎంపీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి వచ్చిన ఫోన్ తో ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. బరిలో ఉన్నది బీజేపీ అభ్యర్థి కాదని, తమ పార్టీ అభ్యర్థని ఆయన నచ్చజెప్పడంతోనే కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీలు హరివంశ్ కు ఓటేసినట్టు సమాచారం.

Tags : BJPharivansh narayanmodindarajya sabha deputy chairman poll

Also read

Use Facebook to Comment on this Post



Menu