12/4/19 12:54 PM

నిత్యానంద ఏర్పాటు చేసిన ‘కైలాస’ దేశ విశేషాలు!

nityananda_660_041219101039

అత్యంత చాకచక్యంగా దేశం నుంచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఓ ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస’ అనే పేరు ఆయన పెట్టుకున్నారు. ఈ దీవి పేరు మీద ఓ వెబ్ సైట్ ను కూడా రూపొందించారు. ఈ దీవిని ఓ ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సమాజాన్ని డిమాండ్ చేస్తోన్న ఆయన, తాజాగా తాను ఏర్పాటు చేసిన దేశానికి  ఓ పాస్‌ పోర్ట్‌ ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని కూడా తయారు చేసుకున్నారు. వెస్ట్ ఇండీస్ దీవుల్లో ఓ దేశమైన ట్రినిడాడ్ అండ్ టుబాగోకు అత్యంత సమీపంలో ఈ ‘కైలాస’  ఉన్నట్లు సమాచారం.

 

కైలాస దేశానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్న ఆయన.. తన దేశానికి ఓ ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ ను కూడా  ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు వీరందరితో కూర్చుని  మంత్రివర్గ సమావేశాలు కూడా జరుపుతున్నారు. తన దేశానికి ప్రధానిగా ‘మా’ను నియమించానని, బంగారం, ఎరుపు రంగుల్లో పాస్ పోస్ట్ ఉంటుందని ‘కైలాస’ వెబ్ సైట్ పేర్కొంది. మెరూన్ కలర్ లో కనిపిస్తున్న సింహాసనంపై నిత్యానంద కూర్చుని ఉండగా, పక్కన నంది బొమ్మతో జెండాను రూపొందించారు. ‘కైలాస’లో పది మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. నిత్యానంద కార్యాలయంతో పాటు విదేశీ వ్యవహారాలు, హోమ్, సోషల్ మీడియా, రక్షణ, విద్య, వాణిజ్యం తదితర శాఖలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే 574 పేజీలతో కూడిన కైలాస రాజ్యాంగాన్ని నిత్యానంద తన అనుచరలుతో కలిసి రూపొందించారు..

 

తాను ఇండియాలో హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నందున్నందుకే,  తన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని నిత్యానంద ఇటీవల కాలంలో తరచుగా అంతర్జాతీయ మీడియా ఎదుట వ్యాఖ్యానిస్తున్నారు. ‘కైలాస’ ను అతి గొప్ప హిందూ దేశంగా ప్రకటించుకున్న ఆయన తాను స్థాపించిన దేశానికి సరిహద్దులు ఉండవని, ప్రపంచంలోని ఏ దేశపు వారైనా రావచ్చని, అయితే తన దేశపు పౌరసత్వం కావాలంటే విరాళాలు ఇవ్వాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఇతర దేశాలతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో తాము ఉన్నామని ఈ దిశగా తమ విదేశీ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని.. అతి త్వరలో తమ దేశాన్ని అత్యున్నత దేశంగా మలుస్తామని నిత్యానంద వ్యాఖ్యానించారు.

 

పదేళ్ల క్రితం నటి రంజితతో  సన్నిహితంగా ఉన్న వీడియోలతో నిత్యానంద ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అనంతరం నిత్యానందపై అనేక అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే  కొంతకాలం పాటు ఆయన జైల్లో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్ ద్వారా విడుదల అయ్యారు. ప్రస్తుతం ఆయన పై కేసుల విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఆయన నేపాల్ సరిహద్దుల ద్వారా దేశం దాటి ఈక్వెడార్ కు చేరుకున్నారు. వేరే దేశంలో తలదాచుకున్నట్లయితే దౌత్యపరమైన ఒత్తిళ్ల ద్వారా ఆయనకు ఇండియాకు తిరిగి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం భారతదేశానికి ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన అత్యంత వ్యూహాత్మకంగా ఓ సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది.

 

కైలాస దేశ అధికార భాషలుః ఇంగ్లీష్, సంస్కృతం, తమిళం

అధికారిక మతం: సనాతన హిందూ ధర్మం

జాతీయ జంతువు: నంది

జాతీయ పక్షిః శరభం

జాతీయ పుష్పంః పద్మం

జాతీయ వృక్షంః మర్రి చెట్టు

 

kailaasa passport

Tags : God man nithyanandaKailaasakailasanepal

Also read

Use Facebook to Comment on this PostMenu