08/7/19 8:31 PM

ఎందుకంత కడుపుమంట : ఆర్టికల్ 370 రద్దుతో భారత్ పై విషం కక్కిన ప్రధాని

Pakistan PM Warns India Of War

దేశ చరిత్రలో సంచలనం నమోదైంది. ఏ ప్రధాని చేయని సాహసం నరేంద్ర మోడీ చేశారు. జమ్మూకాశ్మీర్ విషయంలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేశారు. అంతే కాదు కశ్మీర్ ని రెండు ముక్కలు చేశారు. దీంతో కశ్మీర్ భవిష్యత్తు మారిపోతుందని అంతా ఆశిస్తున్నారు. కశ్మీర్ లో హింస, రక్తపాతం ఆగిపోతాయని.. శాంతిసామరస్యాలు వెల్లవిరుస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదం పీడ అంతమైపోతుందని ఆశలు పెట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్రం చేతుల్లోకి వెళ్లడం ద్వారా కశ్మీర్ కి, భారత దేశానికి అంతా మంచే జరుగుతుందని దేశ ప్రజలు అనుకుంటున్నారు.

 

ఆర్టికల్ 370 రద్దుని భారతీయులంతా స్వాగతిస్తుంటే.. శత్రుదేశం, ఉగ్రవాద దేశం పాకిస్తాన్ మాత్రం పగతో రగిలిపోతోంది. భారత ప్రభుత్వం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇన్నాళ్లు కశ్మీర్ ని అడ్డుపెట్టుకుని దేశంలో ఉగ్రవావాదాన్ని వ్యాపింపజేసిన పాకిస్తాన్ కి, దేశంలో అహింసను ప్రజల్వింపజేసిన పాకిస్తాన్ కి.. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన.. అస్సలు మింగుడుపడటం లేదు. జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని కేంద్రహోంశాఖ మంత్రి తేల్చి చెప్పారు. అంతేకాదు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత కాశ్మీర్ ఆక్సాయ్ చిన్ కూడా భారత్ లో అంతర్భాగమే అని లోక్ సభ వేదికగా చాలా డేరింగ్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతేనా.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడానికి ప్రాణలు అర్పించడానికైనా సిద్ధమని ప్రకటించారు. అమిత్ షా వ్యాఖ్యలతో పాకిస్తాన్ లో కలవరం మరింత పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పగతో రగిలిపోతోంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విషం కక్కారు.

 

ఆర్టికల్ 370 రద్దుని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామం మంచిది కాదన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో భారత్ లో పుల్వామా లాంటి ఉగ్రదాడులు మరిన్ని జరగొచ్చు అన్నారు. అంతేకాదు.. ఈ పరిణామం యుద్ధానికి దారితీయొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. రేసిస్ట్ ఐడియాలజీ ప్రకారం బీజేపీ నడుస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. మంగళవారం పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆర్టికల్ 370 రద్దు మరో పుల్వామా దాడి వంటిదానికి, ఆ తరువాత యుధ్ధానికి దారి తీయచ్చు అన్నారు. గతంలో జరిగిన పుల్వామా ఎటాక్ కు, తమ దేశానికి సంబంధం లేదన్నారు. పుల్వామా వంటి దాడి చివరకు యుధ్ధానికే దారి తీయచ్చు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.

 

అయితే ఆ యుధ్ధంలో ఎవరూ విజయం సాధించరు. కానీ ప్రపంచవ్యాప్తంగా దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రపంచ నాయకులను కలిసి కాశ్మీర్ లోని పరిస్థితులను వివరిస్తుందని ఆయన చెప్పారు. శాంతి కోసం తాము చేసిన యత్నాలపట్ల భారత్ సానుకూలంగా స్పందించలేదని, అందుకే శాంతి చర్చల ప్రతిపాదనను విరమించుకున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాశ్మీర్ ప్రజలను అణచివేయజాలదన్నారు. ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చూడాలన్నది బీజేపీ సిధ్ధాంతకర్తల ఐడియాలజీ.. మహమ్మద్ అలీ జిన్నా ప్రవచించిన రెండు దేశాల థియరీని మోడీ సర్కార్ ప్రతిబింబించినట్టు కనిపిస్తోంది. ఇండియా అన్నది కేవలం హిందువులకేనని, ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా పరిగణించాలన్న ఆర్ఎస్ఎస్ వైఖరి గురించి జిన్నాకు తెలుసు… అని నోటికొచ్చినట్టు వాగారు ఇమ్రాన్ ఖాన్.

 

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చూస్తుంటే.. పాకిస్తాన్.. ఏదో పెద్ద కుట్రకి సిద్ధమైనట్టే అర్థమవుతోంది. పుల్వామా తరహా దాడులు జరగొచ్చని, యుద్ధానికి దారి తీయొచ్చు అని ఇమ్రాన్ అనడం చూస్తే.. తెరవెనుక ఏదో పెద్ద స్కెచ్ తో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు జమ్మూకాశ్మీర్ తో పాకిస్తాన్ కు ఏం పని? జమ్మూకాశ్మీర్ భారతదేశంలో భాగం. జమ్మూకాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాక్ కి ఏమి సంబంధం. పాక్ అంతగా ఎందుకు రగిలిపోతోంది. యుద్ధం వరకు ఎందుకు వెళ్లింది.

 

అంటే.. ఇన్నాళ్లూ కశ్మీర్ ని అడ్డుపెట్టుకుని భారత్ లో సాగించిన మారణహోమానికి ఇక తెరపడుతుందని పాక్ కి భయం పట్టుకుందా? భారత్ లో శాంతి సామరస్యం వెల్లివిరియడం పాక్ కు ఇష్టం లేదా? ఇమ్రాన్ ఖాన్ తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అయినా ఒక దేశ ప్రధాని అయి ఉండి.. ఉగ్రదాడులు, యుద్ధం జరగొచ్చు అని అనడం ఏ విధంగా చూడాలి. ఇమ్రాన్ ఖాన్ ఒక దేశ ప్రధానిగా కాకుండా.. ఉగ్రవాద సంస్థల ప్రతినిధిలా మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా.. యుద్ధం అంటూ జరిగితే తీవ్రంగా నష్టపోయేది పాకిస్తానే అని గుర్తుంచుకోవాలి. భారత్ కొట్టే దెబ్బకు పాక్ జీవితంలో కోలుకునే పరిస్థితి ఉండదు. ఆ దేశం ప్రపంచపటం నుంచి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకోవడం ఖాయం. ఖబడ్దార్ పాకిస్తాన్..

Tags : article 370BJPimran khanIndiajammu kashmirjammu kashmir bifurcationmodipakistanpulwama attackterroristsWar

Also read

Use Facebook to Comment on this PostMenu