02/19/18 8:36 PM

జగన్ సవాల్ ను స్వీకరించిన పవన్..!

Untitled-1 copy

ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రత్యేక హోదా మంటలు రాజేస్తోంది. పాలక, ప్రతిక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో.. పరస్పర దూషణలతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని, టీడీపీ మద్దతిస్తుందా? అని జగన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఒకవేళ అవిశ్వాస తీర్మానం టీడీపీ పెడితే మద్దతిచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని జగన్ అన్నారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్‌ ను చంద్రబాబు పార్ట్ నర్ గా అభివర్ణిస్తూ, కేంద్రంపై అవిశ్వాసం పెట్టేలా చంద్రబాబుని ఒప్పించాలని అని జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

 

దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. కేంద్రంపై జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే.. తాను అన్ని పార్టీల మద్దతు కూడగతానని ప్రకటించారు. మార్చి  4న తాను సైతం ఢిల్లీ వస్తానని, అందరు ఎంపీల మద్దతు కూడగడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ గైడె లైన్స్ ప్రకారం ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చని పవన్ వెల్లడించారు. అనంతరం 50మంది ఎంపీల మద్దతు కూడగట్టొచ్చని అన్నారు. తాము కోరితే టీఆర్ఎస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారు కూడా మద్దతు తెలుపుతారని జనసేనాని వ్యాఖ్యానించారు. వారందరూ కలిస్తే ఏకంగా 80 మంది మద్దతు సైతం వస్తుందని చెప్పారు. అవిశ్వాసం విషయంలో తన వంతు సాయం ఏం చేయమన్నా చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

 

నిన్న జగన్ సవాలు విసిరారు కాబట్టి తాను సమాధానం చెబుతున్నాని జనసేనాని అన్నారు. అఖిల పక్షాన్ని తాను ముందుకు తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. కావాలంటే కర్ణాటక, తమిళనాడు వెళతానని, అక్కడి పార్టీలతో కూడా మాట్లాడతానని పవన్ పేర్కొన్నారు. ఇది తెలుగు జాతి సమస్య అని, పార్టీ సమస్యల కాదని చెప్పుకొచ్చారు.

 

కాగా, అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో జగన్ వెనక్కి తగ్గితే సీఎం చంద్రబాబు ఆ బాధ్యత తీసుకోవాలని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags : accepts challengeap cm chandrababujanasena partyNo confidence Motionpawan kalyanTDPYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu