09/23/18 7:40 PM

నాపై అభిమానంతో రావొద్దు-పవన్ కళ్యాణ్ కీలక విన్నపం

Untitled-1 copy

జనసేనలో చేరాలని అనుకునే వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. అసలు ఎలాంటి వారు జనసేనలోకి రావాలి, జనసేనకి కావాలి అనే విషయాలు వివరించారు. తనపై అభిమానంతో కాకుండా, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే జనసేన పార్టీలోకి రావాలని జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీలోకి వచ్చే వారికి  ప్రజలపై అంకితభావం, ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉండాలని, అలాంటి తపన ఉన్న వారిని కచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. తమ పార్టీలో కుల, మతాలకు ఆస్కారం ఉండదని మరోసారి స్పష్టం చేశారు జనసేనాని. ఇక ప్రతి పౌరుడు ఓటు నమోదు చేయించుకోవాలని పవన్ సూచించారు.

 

కాగా, చిన్నప్పుడు  తనకు  విద్య నేర్పించిన గురువులను పవన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పవన్ చిన్ననాటి స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తన గురువులు తనకు పాఠాలు నేర్పలేదని, విలువలు నేర్పారని ప్రశంసించారు. ఈరోజున తమ టీచర్లను కలవడం తనకు లభించిన అరుదైన అవకాశమని, వారికి పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా పవన్‌ తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి గ్రూపు ఫొటోను చూసి మురిసిపోయారు.

pawan teaacherss pawan teachers

Tags : janasenanellore tourpawan kalyanpawan kalyan teachersrottela panduga

Also read

Use Facebook to Comment on this Post



Menu