05/17/18 4:34 PM

2019 ఎన్నికలే నా టార్గెట్.. జనసేన అధికారంలోకి వస్తే..!

Untitled-1 copy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. 2019 ఎన్నికలకు సీరియస్ గా సన్నద్ధం అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ బస్సుయాత్రను ఎంచుకున్నారు. దీనిక జనసేన పోరాట యాత్ర అని నామకరణం చేశారు.

 

ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ప్రారంభిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మాట్లాడారు. ఉద్యమాల పుట్టినిల్లయిన శ్రీకాకుళం నుంచే తమ యాత్ర ప్రారంభమవుతుందని, 45 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. ఇచ్చాపురంలో గంగపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడతామని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తామని పవన్ చెప్పారు. మొత్తం 17 రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందన్నారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్‌ తెలిపారు. విశాఖపట్నంలోని అంబేద్కర్‌ భవన్‌ లో నిన్న నిద్ర చేసిన పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ పోరాట యాత్ర గురించి వివరాలు వెల్లడించారు.

 

ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలేమిటో తెలుసుకోవడానికి యాత్ర చేపడుతున్నామని పవన్ తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయలేదని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఇలాగే వెనుకబడి ఉంటే.. ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతాయని తెలిపారు. జనసేన పార్టీ మ్యానిఫెస్టో కమిటీ కూడా బస్సుయాత్రలో పాల్గొంటుందని చెప్పారు.

 

మనకు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని పవన్ ఆకాంక్షించారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదని పవన్ మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం బాధాకరమని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే అన్ని జిల్లాల్లో అమరుల స్మారక చిహ్నాలు పెడతామని, 2019 ఎన్నికలే లక్ష్యంగా తాము పనిచేస్తామని జనసేనాని తెలిపారు.

Tags : Bus yatrajanasenajanasena porata yatrapawan kalyanpawan kalyan announces janasena porata yatraspecial category statussrikakulam

Also read

Use Facebook to Comment on this Post



Menu