01/19/18 8:22 PM

జనసేన శ్రేణులకు, అభిమానులకు పవన్ కల్యాణ్ సందేశం..!

Untitled-1 copy

ఓవైపు సినీ విమర్శకుడు కత్తి మహేష్ విమర్శలు, మరోవైపు ఓయూ జేఏసీలో ఆందోళనలు.. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలకమైన ప్రకటనను విడుదల చేసింది. జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.

 

జనసేన పార్టీ శ్రేణుల్ని, అభిమానుల్ని గందరగోళపరచడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆరోపణలు చేసినా స్పందించొద్దని ఆ ప్రకటనలో కోరారు. కుట్రలో చేసే విమర్శలపై ఆవేశంగా స్పదించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇదంతా రాజకీయంలో భాగమే అని ఆ లేఖలో వెల్లడించారు.

 

జ‌న‌సేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండ‌ని ప‌సి ప్రాయం అని, ఇటువంటి ప‌సి బిడ్డ‌ను ఎద‌గ‌నీయ‌కుండా ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయని, ఇదంతా రాజ‌కీయంలో ఒక భాగమనేది గుర్తించి.. జనసేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సంయమ‌నం పాటించాలని సూచిస్తూ జ‌న‌సేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి పేరిట ప్రెస్ నోట్ విడుద‌లైంది.

 

ఈ మ‌ధ్య‌కాలంలో జ‌న‌సేన పార్టీ శ్రేణుల్ని, అభిమానుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేయ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి, జ‌రుగుతున్నాయన్నారు. జనసేనను తెలుగు ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారని పవన్ కల్యాణ్‌కి విశ్వాసం ఉందని, ఆయన మాటలను ఆచరిద్దామని.. ఆయన అడుగు జాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలైన.. కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సంప్రదాయం.. సంస్కృతులని కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. కోసం కృషి చేద్దాం’ అంటూ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

కుల విమర్శలు చేసేవారి పట్ల ఎలా ఉండాలో గతంలో పవన్ కల్యాణ్ తెలిపారని ప్రెస్‌ నోట్‌ లో పేర్కొన్నారు. జనసేనను అభిమానించేవారంతా ఆ రోజు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను గుర్తు చేసుకోవాలని కోరారు. కుల విమర్శలు చేస్తోన్న వారిని విస్మరించాలని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

26904122_521929761539637_6814826276429423602_n

 

 

99

26906939_521929781539635_1810109750096660433_n

Tags : appealjanasena partyjanasena press noteKathi Maheshpatiencepawan kalyanpawan kalyan fanspress note

Also read

Use Facebook to Comment on this Post



Menu