11/5/18 9:58 PM

జనసేన వస్తే తలెత్తుకునేలా చేస్తానని పవన్ హామీ

pawan caste

నేను కాపు కమ్మ కాదు.. నాకు కులమతాల పట్టింపు లేదు.. నేను కులం మార్చుకుంటున్నా.. ఇవాళ్టి నుంచి నా కులం రెల్లి కులం.. ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందుకున్న కొత్త నినాదం. తూర్పుగోదావరి జిల్లాలో పోరాటయాత్రలో ఉన్న పవన్ రెల్లి సామాజికవర్గం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వారి సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఎమోషన్ అయ్యారు. అన్ని కులాల మనుషుల మలమూత్రాలు శుభ్రం చేసే రెల్లి కులస్తులకు తాను అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.

 

రెల్లి సామాజికవర్గం దుస్థితిని చూసి తనకు వెక్కివెక్కి ఏడ్వాలని అనిపిస్తోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ రోజు నుంచి రెల్లి కులస్తుడినేననీ, అందరికీ అండగా ఉంటానని జనసేనాని అన్నారు. రెల్లి కులస్తుల బాధలు ఇకపై తన బాధలనీ, తనకు ఎలాంటి మతం లేదని పవన్ స్పష్టం చేశారు.

 

అణగారిన కులాల్లో కూడా అణగారిన వర్గం రెల్లి కులమని పవన్ అన్నారు. ఇల్లు ఇద్దెకు ఇవ్వమని బ్రతిమాలడం కాకుండా, స్వయంగా తమ ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇచ్చే స్థాయికి రెల్లి కులం ఆడబిడ్డలు ఎదగేలా చేస్తానని పవన్ ప్రకటించారు. జనసేన ప్రభుత్వం వస్తే ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ రెల్లి సామాజికవర్గానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెల్లి సామాజికవర్గం స్వయంకృషితో, తమ కాళ్లపై తాము నిలబడేలా చర్యలు తీసుకుంటానని పవన్ అన్నారు. పారిశుద్ధ్య పనులు చేపడుతున్న రెల్లి సామాజికవర్గం మనస్సు చాలా గొప్పదనీ, ఇప్పటి నుంచి ఈ సామాజికవర్గం గొంతుగా తాను మారుతానని జనసేనాని స్పష్టం చేశారు.

 

అన్నికులాల మలమూత్రాలు శుభ్రుపరిచే ఉన్నత కులం రెల్లి కులం అని పవన్ అన్నారు. మీ జీవితాల్లో వెలుగు నింపకపోతే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసినా ప్రయోజనం లేదన్నారు. తాను అందరు రాజకీయ నాయకుల్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడనని, హామీలు ఇవ్వను అని చెప్పిన పవన్.. తాను కేవలం ఆశయాలను పాటిస్తాను, మాట్లాడతాను, ఆచరిస్తాను అని చెప్పారు. తాను మాట సాయం కంటే చేత సాయం చేసే వాడినని పవన్ స్పష్టం చేశారు.

 

రాజకీయ నాయకులను కులాల వారీగా కాకుండా, వారి వ్యక్తిత్వం ఆధారంగా ఎన్నుకోవాలని పవన్ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ సమక్షంలో పలువురు వైద్యులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రజాధనాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వారు తమ సెల్ఫ్ చెక్కులు మాదిరి రాసేసుకుంటున్నారని విమర్శించారు. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, ప్రజాస్వామ్యంలో వైద్యుల భాగమైనప్పుడే వారికి ప్రశ్నించే హక్కు వస్తుందని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే కనుక ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లాలని, నచ్చిన వారికే ఓటు వేయండని సూచించారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే హక్కు తనకు ఉందని, తనను ఎవరూ అడ్డుకోలేరని పవన్ స్పష్టం చేశారు.

 

Tags : east Godavari porata yatrajanasenapawan kalyanpawan kalyan castepawan with doctorssanitation workers

Also read

Use Facebook to Comment on this PostMenu