03/22/19 11:04 AM

పాపం పవన్ కళ్యాణ్.. ఇన్ని అప్పులు ఉన్నాయా

Pawan Kalyan Declares Assets And Debts

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. విశాఖలోని జోన్‌-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటించారు. ఆ వివరాలను అఫిడవిట్‌ రూపంలో రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తన పేరిట రూ.12.79 కోట్ల విలువైన చరాస్థులు, రూ.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే తనకు రూ.32.40 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు.

 

పవన్ కళ్యాణ్ ఆస్తి, అప్పుల వివరాలు:
చరాస్ధుల విలువ – రూ.12.79 కోట్లు
స్ధిరాస్తుల విలువ – రూ. 40.81 కోట్లు
అప్పులు – రూ. 33.72 కోట్లు
భార్య, బిడ్డల పేరున ఉన్న ఆస్తుల విలువ – రూ.3.20 కోట్లు
312 గ్రాముల బంగారం, డైమండ్స్, ప్లాటినమ్.
మెర్సిడెస్ బెంజ్ R-class R350, వోల్వో XC90, హార్లే డేవిడ్ సన్
మహింద్రా స్కార్పియో, స్కోడా ర్యాపిడ్, టొయోటా ఫార్చునర్
శంకర్ పల్లి మండలంలో వ్యవసాయ భూమి
హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో వ్యవసాయేతర భూమి
నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో 10వ తరగతి చదివిన పవన్
2016-17 లో చెల్లించిన ఆదాయపన్ను – రూ.15.28 కోట్లు
2017-18 లో చెల్లించిన ఆదాయపన్ను – రూ.9.60 కోట్లు
ఆదాయపు పన్ను బాకీ – రూ.34.42 లక్షలు
పవన్ కళ్యాణ్ అప్పుల వివరాలు:
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర రూ.2.40 కోట్ల మేర అప్పు తీసుకున్నానని పవన్ తెలిపారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ దగ్గర రూ.1.25 కోట్లను రుణంగా తీసుకున్నానన్నారు. తన వదిన సురేఖ దగ్గర రూ.1.07 లక్షల ఆస్తులు తీసుకున్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎం.ప్రవీణ్ కుమార్‌కు రూ.3 కోట్లు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్‌కు రూ.2 కోట్లు, శ్రీ బాలాజీ సినీ మీడియాకు రూ.2 కోట్లు, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రాలయకు రూ.27.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని పవన్ తెలిపారు. వీటిలో చాలా వరకు సినిమాలకు అడ్వాన్స్‌ల కింద తీసుకున్నవేనని భావిస్తున్నారు.

 

రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చినట్టు పవన్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన భార్య అన్నా లెజినోవా కన్నా రేణుదేశాయ్ ధనవంతురాలు అని వెల్లడించారు. లెజినోవా పేరిట రూ.30.5 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. కొడుకు అకిరా పేరు మీద రూ.1.51 కోట్ల ఆస్తులు, ఆద్య పేరు మీద రూ.1.04 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పవన్ చెప్పారు.

Tags : affidavitdebtsgajuwakanomintaionpawan kalyanpawan kalyan assets

Also read

Use Facebook to Comment on this Post



Menu