01/22/18 4:30 PM

అంజన్న ఆశీస్సులు తీసుకున్న పవన్ కల్యాణ్..!

Untitled-1 copy

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ టూర్ షురూ అయింది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో తొలిసారిగా పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ లోని జనసేన కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కు.. భార్య అన్నాలెజ్నేవా .. హారతి ఇచ్చి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నానికి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకున్న జనసేనానికి ఆలయ పండితులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.11 లక్షల విరాళాన్ని పవన్ అందించారు. ఆలయ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. తనను చల్లగా చూడాలని స్వామిని మొక్కుకున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. స్వామి ఆశీస్సులతోనే తాను 2009లో పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు మరోసారి ఆయన గుర్తు చేసుకున్నారు.

26815144_523549021377711_6491167064389652414_n

పవన్ పర్యటన సందర్భంగా అభిమానులు ఉత్సాహం కనబరిచారు. పవన్ ను చూసేందుకు ఎగబడ్డారు. తనను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ కోసం పవన్ కూడా కారు పైకి ఎక్కి చేయి ఊపి, అభివాదం చేసి వారిలో జోష్ నింపారు.

27067234_523549251377688_2032527949037254337_n

ఇక పవన్ కల్యాణ్ వెనుక ఎవరో ఉన్నారని పలువురు వ్యాఖ్యానించడంపై ఆయన అభిమానులు ఫైర్ అయ్యారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ పవన్ వెనుక ఉన్నారంటూ కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారని, కానీ అదంతా అవాస్తవం అని చెబుతున్నారు. ఎవరో పంపిస్తే పవన్ రారని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని పొగిడితే తప్నేంటని పవన్ ఫ్యాన్స్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

26903999_523549258044354_2538090508013457263_n

కాగా ముందుగా.. స్థానిక పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ అవుతారు. మూడు, నాలుగు జిల్లాల నేతలతో సమావేశమైన తర్వాత తన యాత్ర పూర్తి వివరాలను వెల్లడిస్తారు. వీలైతే పాదయాత్ర, లేకపోతే బస్సుయాత్ర.. అవసరమైతే రోడ్ షో.. ఇలా వీలున్న మార్గాల్లో ప్రజల చెంతకు వెళతానని పవన్ ఇదివరకే ప్రకటించారు. ప్రత్యేకించి విరామం అనేది ఉండదన్న ఆయన, ప్రజాసమస్యలను అధ్యయనం చేయడానికే ఈ యాత్రను చేపడుతున్నానని తెలిపారు.

Tags : donationhanuman templejanasena partykondagattu anjaneyaswamy templepawan kalyanpawan prayerspolitical tour

Also read

Use Facebook to Comment on this Post



Menu