02/3/19 12:26 PM

పవన్ కళ్యాణ్ దూకుడు.. గెలుపు గుర్రాలపై ఫోకస్

Janasena Screening Committee Announced

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పెద్దగా సమయం లేదు. దీంతో గెలుపు లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు పార్టీని ప్రజలకు చేరువ చేస్తూనే… మరోవైపు ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో స్క్రీనింగ్‌ కమిటీని నియమించారు.

 

ఏపీలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌.. అందుకోసం అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు. జనసేన నుంచి దాదాపు 60శాతం కొత్త వారికి సీట్లు కేటాయిస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాత కొత్త కలయికగా అభ్యర్థుల ఎంపిక ఉండబోతుందన్న సంకేతాలు జనసేనాని ఇచ్చారు.

 

అభ్యర్థుల ఎంపిక కోసం పవన్‌ స్క్రీనింగ్‌ కమిటీని నియమించారు. పార్టీలో కీలకంగా ఉన్న ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పవన్‌ పొలిటికల్‌ సెక్రెటరీ హరిప్రసాద్‌, పార్టీ సీనియర్‌ నేతలు తమ్మిరెడ్డి శివశంకర్‌, మాదాసు గంగాధరం, పార్టీ ప్రధాన కార్యదర్శి అరహంఖాన్‌లకు ఈ కమిటీలో చోటు కల్పించారు. జనసేన అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఈ కమిటీ కీలకపాత్ర పోషించనుంది. ఇప్పటికే జనసేనాని తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. జనసేన తరఫున గుంటూరు ఎంపీ అభ్యర్థిగా తోట చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నారు.

 

ఇదే స‌మయంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జనసేన అభ్య‌ర్ధుల విష‌యంలో పవన్ ఓ అంచ‌నాకు వచ్చినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం ఎంపీ అభ్య ర్థిగా ఆకుల సత్యనారాయణ పేరును ప్రకటించే అవకాశముందట. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి కందుల దుర్గేష్‌, తుని నుంచి రాజా అశోక్‌బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ రూరల్‌ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి, పి.గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లు దాదాపు ఖ‌రారైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇక‌, వ‌ప‌న్ సైతం పిఠాపురం నుండి పోటీ చేస్తే..ఆ ప్ర‌భావం గోదావ‌రి జిల్లాలపై ఉంటుంద‌ని జనసేన వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఏపీ రాజ‌కీయాల్లో తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయాల‌కు ప్ర‌త్యేక స్థానం ఉన్న విషయం విదితమే. ఈ జిల్లాలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందో వారే అధికారంలోకి వ‌స్తార‌ని సెంటిమెంట్ ఉంది. దీంతో తూర్పుగోదావ‌రి జిల్లాపై ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు.

 

మరోవైపు ఉమెన్ వింగ్‌ను కూడా జనసేనాని ప్రకటించారు. ఇందులో యువత, విద్యాధికులు, డాక్టర్లు, లెక్చరర్లు, లాయర్లు, ఐటీ నిపుణులు, గృహిణులు ఉన్నారు. కెరీర్‌‌ను వదులుకుని ప్రజాసేవ కోసం వచ్చిన ఆడపడుచులు చాలామంది ఉన్నారు. మరికొందరు సీనియర్ నాయకులకు వారి అనుభవం, సామర్థ్యాన్ని బట్టి అవకాశం కల్పించారు.

 

* వీరమహిళ చైర్మన్‌గా కర్నూలుకు చెందిన సీఏ విద్యార్థిని జవ్వాజి రేఖ (25) నియామకం. ఆడిటర్‌గా పని చేస్తూ పార్టీకి సేవలు.
* వైస్ చైర్మన్లుగా సింధూరి కవిత (25), షేక్ జరీనా (28), నూతాటి ప్రియా సౌజన్య (30), శ్రీవాణి (47).
* పొలిటికల్ అఫైర్స్ కమిటీలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సుజాత పాండాకు చోటు.
* పాలసీ వింగ్ చైర్మన్‌గా డాక్యర్ యామినీ జ్యోత్సా కంబాల.
* పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీల్లోనూ పలువురు మహిళలకు చోటు.
* పార్లమెంటరీ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా షాహిన్ సయ్యద్, షేక్ రజియా, మంజుల సునీత, సావిత్రి, వాశిలి తుషార బిందు.
* క్యాంపెయినింగ్ అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్‌గా ఉషశ్రీ పినిషెట్టి (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)
* జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా లక్ష్మికుమారి
* పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా పద్మావతి

Tags : ap elections 2019candidates selectionjanasenajanasena mla candidatesjanasena women wingpawan kalyanscreening committee

Also read

Use Facebook to Comment on this PostMenu