05/25/18 3:41 PM

అన్నంత పని చేస్తున్న పవన్ కల్యాణ్..!

Untitled-1 copy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నంత పని చేస్తున్నారు. నిరాహార దీక్ష చేయాలని ఫిక్స్ అయ్యారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్ధానం కిడ్నీ బాధితులతో సమావేశమైన జనసేనాని.. 48 గంటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించి, కిడ్నీ బాధితుల్ని ఆదుకోకపోతే నిరాహారదీక్షకు దిగుతానని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉదయం 11 గంటలకు పవన్ విధించిన డెడ్ లైన్ పూర్తయింది. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడంతో పవన్ ఒక్కరోజు దీక్షకు సిద్ధమయ్యారు. దీక్షకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అసలు పవన్ అల్టిమేటాన్ని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదని జనసేన నాయకులు మండిపడుతున్నారు.

 

ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు శ్రీకాకుళంలో తాను బస చేస్తున్న రిసార్టులోనే పవన్‌ నిరాహార దీక్ష చేస్తారని, రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్యే పవన్‌ నిరాహార దీక్ష ఉంటుందని జనసేన పేరిట ప్రకటన విడుదలైంది. పలు కారణాల దృష్ట్యా పవన్ దీక్షను ఇలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

 

ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలని, వెంటనే ఆరోగ్య శాఖకు మంత్రిని నియమించాలని పవన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా. పంచాయితీ, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పవన్ ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్దానం కిడ్నీ సమస్యలపై చేపట్టిన కార్యక్రమాలని వివరించారు. అయితే చంద్రబాబు వివరణతో సంతృప్తి చెందని జనసేనాని దీక్షకు ఫిక్స్ అయ్యారు.

 

పవన్ తన జనసేన పోరాట యాత్రను భద్రతా కారణాల వల్ల గురువారం, శుక్రవారం నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు, అదే సమయంలో ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో దీక్షకు పూనుకుంటున్నారు.

Tags : ap cm chandrababu naidujanasenajanasena porata yatraPawan kalyan hunger strikesrikakulamuddanam kidney issue

Also read

Use Facebook to Comment on this Post



Menu