11/6/18 11:48 PM

చంద్రబాబు పాలనలోనే తెలంగాణ ఉద్యమానికి బీజం – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Meets SEZ Sufferers

రాష్ట్ర విభజనకు అసలు కారణం సెజ్‌లేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్ఈజెడ్‌ల కారణంగానే రాష్ట్రం విడిపోయిందన్నారు. బలవంతంగా భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని పవన్ ఆరోపించారు. కాగా, జనసేన అధికారంలోకి వస్తే సెజ్ రైతులపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరిలో పర్యటిస్తున్న పవన్ కాకినాడ సెజ్ బాధితులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం వస్తే ఎస్ఈజెడ్‌లపై జనసేన తరపున ప్రత్యేక కమిటీని నియమిస్తామన్నారు. రైతు కన్నీరు పెడితే దేశానికి మంచిది కాదన్న పవన్.. సెజ్‌లపై సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

 

మంగళవారం కాకినాడ సెజ్ కన్వెన్షన్ హాల్‌లో సెజ్ బాధితులతో సమావేశం నిర్వహించారు పవన్. ఈ సందర్భంగా సెజ్ బాధితులు తమ కష్టాల్ని జనసేనానికి తెలిపారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న పవన్ కళ్యాన్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితికి రాజకీయ నాయకులే కారణమన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా పారిశ్రామికవేత్తల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. సెజ్‌ల కారణంగా భూముల బంధాలు తెగిపోతున్నాయన్నారు. రాజ్యంగ బద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కుల్ని సాధించుకుందామన్నారు పవన్.

 

చంద్రబాబులా ఏరువాక ఫోటోలకు, జగన్‌ల బుగ్గలు నిమరనని పవన్ ఎద్దేవా చేశారు. ఏ ప్రాంతంలో సెజ్‌కి వెళ్లినా ఫ్యూడలిజం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం భూములు తీసుకున్నా… ప్రైవేటు వ్యక్తులు సంతకాలు పెడుతున్నా పరిశ్రమలు మాత్రం స్థాపించడం లేదని పవన్ ఆరోపించారు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను చూస్తే భయం వేస్తుందన్న పవన్.. రెండు ఎన్నికల అనుభవం తర్వాతే 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కాగా చంద్రబాబు హయాంలోనే తెలంగాణ యువతలో కోపాన్ని, ఆవేశాన్ని తాను చూశానని, తెలంగాణ ఉద్యమానికి అదే కారణమైందని పవన్ వ్యాఖ్యానించారు.

Tags : chandrababueast godavari praja porata yatrajanasenapawan kalyanpawan kalyan meets sez sufferersys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu