01/26/18 5:05 PM

పవన్ కళ్యాణ్ – ది బ్రహ్మ పదార్ధం !!

Pawan-Kalyan-Press-meet
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయా అరంగేట్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. దీంతో తమ అభిమాన నటుడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రశ్నించడానికి వస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషించారు. ఈ క్రమంలో రాజకీయాలలో చిరంజీవి వల్ల రాని మార్పు,  పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడని అందరూ భావించారు. అంతే కాకుండా ప్రజల తరుపున ప్రభుత్వాలను తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రశ్నిస్తారు అని అందరూ అనుకున్నారు.
 2014 ఎన్నికలు టిడిపి బిజెపి పార్టీల కు మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం పవన్ అనుసరిస్తున్న వైఖరి అందరికీ విసుగు చెందిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్న పవన్ కళ్యాణ్… ప్రభుత్వాలకు భజన చేస్తూ ఉండడం జనసేన కార్యకర్తలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్ర గత ఎన్నికలప్పుడు కేసీఆర్ తాట తీస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్. తన తాజా పర్యటనలో  కెసిఆర్ హార్డ్ వర్కర్  అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించకుండా విపక్ష పార్టీ లపై పవన్  చేస్తున్న వ్యాఖ్యలు అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అయోమయంలో పడిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ తన పర్యటనలో అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ, పార్టీని ఎందుకు స్థాపించాడో అనేది ఒక ఉద్దేశం లేకుండా మాట్లాడుతున్నారని రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎందుకు స్థాపించాడో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి  కూడా తెలియదని ఉండవల్లి అన్నారు. అయితే మరో నేత ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ జనసేన గురించిగానీ పవన్ కళ్యాణ్ గురించి గాని  మాట్లాడి నా స్థాయి తగ్గించుకొన్నని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నా జీవితంలో చాలామంది పిచ్చివాళ్లను చూశాను కానీ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పిచ్చోడిని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరి అభిమానులకు కార్యకర్తలకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఒకరకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అన్న సందేహం ఇప్పుడు పలువురిని తొలిచి వేస్తుంది.

Tags : chiranjeevijanasenaKCRpawan kalyanpawan kalyan politicsTDPtrs

Also read

Use Facebook to Comment on this Post



Menu