11/12/18 12:17 PM

చంద్రబాబు, జగన్‌ చేయలేని పని పవన్ చేశారు..!

Pawan Kalyan Request To Janasena Leaders

నేను కాపు కాదు కమ్మ కాదు.. నాకు ఏ కులం లేదు.. అంటూ ఈ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుచుగా అంటున్నారు. నాకు కులపిచ్చి లేదని అన్ని కులాలు తనకు సమానమే అనే నినాదాన్ని వినిపిస్తున్నారు. తనకు కులాన్ని ఆపాదించొద్దని, ఒక్క కులానికే పరిమితం చేయొద్దని పలు సందర్భాల్లో పవన్ అన్నారు. ఆ విధంగా అన్ని కులాల వారికి దగ్గరయ్యేలా పవన్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరోసారి పవన్ అలాంటి సూచనలే పంపారు.

 

వివరాల్లోకి వెళితే.. కార్తీక మాసం ప్రారంభమైంది. ఇదే సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కులసంఘాలు పార్టీల పేరిట వనభోజనాలు ఏర్పాటు చేసి, తమ వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్న వేళ, జనసేనాని తన పార్టీ నేతలకు కొన్ని సూచనలు చేశారు.

 

“జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి. కానీ, నా పేరు మీద కానీ, జనసేన పార్టీ పేరు మీద కానీ జరపద్దని నా మనవి” అంటూ పవన్ తన ట్విట్టర్ ఖాతాలో రిక్వెస్ట్ చేశారు. అదే సమయంలో “ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు, తల్లులకు.. కార్తీకమాసం శుభాకాంక్షలు” తెలిపారు పవన్.

 

కార్తీకమాసంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు నలుగురిని ఒక చోటికి చేర్చేందుకు పెద్దలు వనభోజనాలు ప్లాన్ చేశారు. కానీ రాను రాను అవి కుల వనభోజనాలుగా రూపాంతరం చెందాయి. అక్కడ కుల సంఘాల చర్చలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఆయా కులసంఘాల మద్ధతు కోసం ఈ వనభోజనాలను స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అలాంటి అపవాదు తమపై రాకుండా పవన్ జాగ్రత్తపడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటికి జనసేన పార్టీతో పాటు తనను దూరంగా ఉంచాలని జనసేన శ్రేణులకు పవన్ విజ్ఞప్తి చేయడం విశేషం.

Tags : castedont use pawan namejanasenajanasena leaderskarthika masampawan kalyanpawan requestvanabhojanalu

Also read

Use Facebook to Comment on this Post



Menu