01/6/19 12:26 PM

చిరంజీవిని మోసం చేశారు, లేదంటే సీఎం అయ్యేవాడు : పవన్

Pawan Kalyan Sensational Comments On Chiranjeevi

అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచితూచి ఆడుగులు వేస్తున్నారు. ప్రతి అడుగుని చాలా కేర్‌ఫుల్‌గా వేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ నిర్మాణం, జనసేనలోకి తీసుకునే నాయకులు, టికెట్ల విషయం.. ఇలా ప్రతి దాంట్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనికి కారణం ప్రజారాజ్యం పార్టీ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన అనుభవాలే. తన అన్నయ్య చిరంజీవిలా తాను కాకూడదని పవన్ పట్టుదలగా ఉన్నారు. తన అన్నలా మోసపోకూడదని, దెబ్బతినకూడదని పవన్ నిర్ణయించుకున్నారు. పార్టీని సక్సెస్‌ఫుల్‌గా లాంగ్‌టైమ్ రన్ చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు.

 

ఈ క్రమంలో ప్రజారాజ్యం గురించి పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. జనసేన కార్యకర్తలతో భేటీ అవుతున్న పవన్.. ప్రతి సమావేశంలోనూ పీఆర్పీ గురించి, చిరంజీవికి ఎదురైన అనుభవాల గురించి చెబుతున్నారు. తన అన్న ఎలాంటి తప్పు చేయలేదని, చాలామంచి వాడని, పరిస్థితుల కారణంగా అనూహ్య నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వివరిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న చిరంజీవిని మోసం చేశారని పవన్ చెప్పారు. నాడు పదవీ వ్యామోహంతో పీఆర్పీలోకి వచ్చిన నేతలంతా చిరంజీవి వంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారని ఆరోపించారు. చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం ఆవిర్భావంలో తాను కూడా కీలక పాత్ర పోషించానని పవన్ చెప్పారు. పార్టీ పెట్టడానికి చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తానూ ఒకడిని అన్నారు. అయితే ఓపిక లేని నాయకులు చేరినందు వల్లే పీఆర్పీతో సామాజిక న్యాయం జరిగే అవకాశం లేకుండా పోయిందని పవన్ వాపోయారు.

 

డబ్బు ప్రభావం లేని రాజకీయాలు చేయాలన్న లక్ష్యంతో పీఆర్పీ ఏర్పాటైందన్నారు. చిరంజీవి వంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి వస్తే అవినీతి అంతమవుతుందని, సామాజిక న్యాయం జరుగుతుందని నాడు ప్రజలు ఆకాంక్షించారని, అయితే అది పక్కదారి పట్టిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని, అధికార ఫలాలు అనుభవించవచ్చని ఆశించామన్నారు. కానీ ఎవరెవరో పార్టీలోకి వచ్చారని, ఓడిపోగానే వెళ్లిపోయారని దానివల్ల పీఆర్పీ లక్ష్యం నీరుగారిందని పవన్ వాపోయారు.

 

పీఆర్పీ విషయంలో జరిగిన తప్పిదం రిపీట్ అవ్వకుండా జనసేన నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నామని పవన్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజకీయంగా అనేక దెబ్బలు తిన్నానని, దెబ్బలు తినే కొద్ది మరింత రాటుదేలుతానని పవన్ అన్నారు. పీఆర్పీ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని పార్టీ కమిటీల నియామకాలకు తొందరపడలేదన్నారు. రాత్రికి రాత్రే రాజకీయాల్లో ఎవరూ ఎదగలేరని, కనీసం పాతిక సంవత్సరాలు ఓపిక పట్టాలని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

తాను పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో పార్టీని స్థాపించినట్టు పవన్ తెలిపారు. సినిమాల్లోకి రాక ముందే సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టానని వెల్లడించారు. దేశంలో కులాల ప్రభావం, అంబేద్కరిజం వంటి వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న తరువాతే పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు.

Tags : chiranjeevicm chiranjeevicm pawanjanasenapawan kalyanpawan kalyan prppraja rajyam party

Also read

Use Facebook to Comment on this PostMenu