07/6/19 12:14 PM

దేశం కాని దేశంలో : జనసేన ఓటమిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan Sensational Comments On Jail Leaders

ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల సమావేశాల్లో తప్ప జనసేనాని పవన్ కళ్యాణ్ బయట పెద్దగా కనిపించింది లేదు. అలాంటి పవన్ ఫస్ట్ టైమ్.. చాలా ఘాటైన స్పీచ్ ఇచ్చారు. దేశం కాని దేశంలో పవర్ ఫుల్ డైలాగులు పేల్చారు. ఏపీ రాజకీయాల గురించి కసిగా మాట్లాడారు. జనసేన ఓటమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన లక్ష్యం ఏంటో తెలియజేశారు. జైలుకి వెళ్లి వచ్చిన వ్యక్తులే ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటతిరుగుతున్నారని, అటువంటిది సత్యాన్ని మాట్లాడి ఇక్కడ తిరగడానికి నాకేం ఇబ్బంది అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కుంభకోణాలు చేసి ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. పవన్ కామెంట్స్ ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ పవన్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అనేదానిపై చర్చ నడుస్తోంది.

 

అమెరికాలో తానా సభలకు చీఫ్ గెస్ట్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు రావని, ఓడిపోతామని ముందే తెలుసునని పవన్ అన్నారు. ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నా అని చెప్పారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నానని వెల్లడించారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదని పవన్ పిలుపునిచ్చారు.

 

ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని… అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక… ప్రజలను పట్టించుకోవట్లేదని పవన్ ఆరోపించారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో పార్టీలు ఉంటున్నాయని పవన్ విమర్శించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో… జనసేన ఓటమిపై స్పందించిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బచ్చి ఓట్లు సంపాదించి గెలవడం కంటే… డబ్బు ఇవ్వకుండా… ఓట్లు రాకుండా ఓడిపోయినా… ఆ అపజయాన్ని తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు.

 

మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసు అన్నారు. అయితే, ప్రజల మార్పు కోసం తాను నమ్మిన మార్గంలోనే నడుస్తానని అన్నారు. జైలుకి వెళ్లి వచ్చిన వ్యక్తులే ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నప్పుడు, ఏ తప్పు చేయని, సత్యం మాట్లాడే నేనెందుకు బాధపడాలని, తాను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని పవన్ ప్రశ్నించారు. అపజయం తనను మరింత బలోపేతం చేసిందని, పాలకులు భయపెట్టి పాలిస్తామంటే కుదిరే పరిస్థితి నేటి సమాజంలో లేదని పవన్ చెప్పారు.

 

నాయకులు నియంతలుగా మారితే ప్రజలే గుణపాఠం చెబుతారని, చరిత్ర ఎన్నోమార్లు ఈ సత్యాన్ని చెప్పిందని, విలువలతో రాజకీయాలు చేయబట్టే జనసేన ఓడిపోయిందని పవన్ వివరించారు. జనసేన పార్టీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎన్నారైలకు పవన్ కళ్యాణ్ సూచించారు. విలువలతోనే జీవిస్తానన్న పవన్… బల్బుని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్‌లా ఎన్ని అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా పోరాడతానని తేల్చి చెప్పారు.

 

ఓటుకు నోటు విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పవన్ కోరారు. ఖుషి సినిమా తర్వాత… యువతను చైతన్య పరచాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నానన్న పవన్… స్వామి వివేకానంద స్ఫూర్తితో… ఎంతో ఆలోచించి జనసేన పార్టీ పెట్టానన్నారు. ఎవరెన్ని దెబ్బలు కొట్టినా… వెనకడుగు వేయకూడదన్న బలమైన కాంక్షతో ఉన్నట్లు తెలిపారు. జనసేన ఓటమి తర్వాత… ఆ అపజయాన్ని జీర్ణించుకోవడానికి తనకు 15 నిమిషాలే పట్టిందన్న పవన్… తాను స్కాములు చేసి ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం చాలా కష్టం అని తెలిసి కూడా తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. తాను డబ్బు పంచి ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. నన్ను కూడా ఓడిస్తారు అని తెలిసినా.. పాలిటిక్స్ లోకి వచ్చానన్నారు. తాను ఓడిపోతే నవ్వులపాలు అవ్వాల్సి వస్తుందని తెలిసినా.. రాజకీయాల్లో వచ్చానన్నారు.

 

అమెరికా వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తానా వేడుకలకు వచ్చిన వారినే కాదు.. ఏపీ రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. పవన్ ఈ రేంజ్ లో స్పీచ్ ఇస్తారని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. జనసేన ఓడిపోవడానికి కారణం డబ్బు అని పవన్ డైరెక్ట్ గానే చెప్పారు. ఇకపోతే.. జైలుకి వెళ్లి వచ్చిన వ్యక్తులే బయట హ్యాపీగా తిరుగుతున్నారని.. పవన్ అనడం స్పీచ్ లో హైలైట్ గా మారింది. అంతేకాదు తాను ఎలాంటి స్కామ్ లు చేయలేదన్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ జైలు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది డిస్కషన్ కు దారి తీసింది. పవన్ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి మాట్లాడింది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన గురించేనా అంతా చర్చించుకుంటున్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు కేవలం ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే. జనసేనాని పవన్ పోటీ చేసిన రెండు చోట్ల భీమవరం, గాజువాకలో ఓడిపోయిన సంగతి విదితమే.

Tags : ap cm ys jaganchandrababuelectionsjanasenapawan kalyanpoliticsspeechtana

Also read

Use Facebook to Comment on this PostMenu