03/22/19 10:35 AM

జగన్‌ను మాత్రమే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Targets Only Ys Jagan

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ప్రత్యర్థులను టార్గెట్ చేశారు. సీఎం చంద్రబాబు కన్నా జగన్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే, జగన్ సీఎం అయితే రాష్ట్రాన్ని దోచుకుంటారని, కబ్జాలు పెరిగిపోతాయని జనసేనాని హెచ్చరించారు. జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఓ పోలీస్ కావాలని.. అందుకే.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపుతున్నానని పవన్ వెల్లడించారు.

 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురువారం గాజువాక నుండి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ అధినేత జ‌గ‌న్ ల‌క్ష్యంగా విమర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ కేసుల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ ను మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ ప‌దేళ్ల క్రిత‌మే బిగించేశారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ ఎలాంటి అభ్య‌ర్దుల‌ను నిల‌బెడితే తాను అలాంటి వారినే బ‌రిలో దించుతున్నాన‌ని చెప్పారు.

 

వైసీపీకి.. లక్ష్మీనారాయణను చూస్తేనే దడ మొదలవుతుందని పవన్ అన్నారు. వైసీపీ దోపిడీలను అరికట్టడానికి, అడ్డుకోవటానికి మాజీ జేడీని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వైజాగ్ కి లక్ష్మీనారాయణ కొత్వాల్ గా పవన్ అభివర్ణించారు. వైజాగ్ కు మాజీ జేడీ కాపలా అని.. వైపీసీ దోపిడీ, కబ్జాల నుంచి కాపాడటానికి వచ్చిన వ్యక్తి అని గొప్పలు చెప్పారు. మాజీ జేడీని గెలిపిస్తే వైజాగ్ సురక్షితంగా ఉంటుందని.. అందరూ జనసేనకు ఓటేయాలని పవన్ పిలుపునిచ్చారు.

 

స్పెషల్ స్టేటస్ అనగానే జగన్ కు దడ మొదలవుతుందని పవన్ ఎద్దేవా చేశారు. కేంద్రం ఎక్కడ కేసుల ఫైల్ చూపిస్తుందో అని జగన్ భయపడుతున్నాడని చురకలు అంటించారు. అందుకే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ పై విమర్శలు చేశారు. లక్ష్మీనారాయణ చేతుల్లో జ‌గ‌న్ జాతకం ఉందన్నారు. వైసీపీకి అసలు ఓట్లు అడిగే అర్హతే లేదని పవన్ తేల్చి చెప్పారు.

 

పవన్.. ప్రత్యర్థులపై విమర్శలు చేయడం తప్పు లేదు. కానీ కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్… చంద్రబాబు బినామీలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవన్.. చంద్రబాబుకి అమ్ముడుపోయారని.. అందుకే జగన్ ను మాత్రమే తిడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags : ap elections 2019cm chandrababuex jd lakshmi narayanagajuwakajansenapawan kalyanVISAKHAys jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu