03/13/18 9:34 PM

ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హెచ్చరిక..!

Untitled-1 copy

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నాకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని జనసేనాని అన్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా, 35 ఎకరాల విస్తీర్ణంలో 14న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ మాలకొండయ్యకు.. పవన్ కల్యాణ్ లేఖ రాశారు.

 

మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో భద్రతకు పోలీసు శాఖవారు తీసుకుంటున్న జాగ్రత్తలకు జనసేనాని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మార్చి 14 తర్వాత కూడా తనకు అందిస్తున్న భద్రతను కొనసాగించాల్సిందిగా కోరారు. తాను భద్రత కోరుతున్నది ప్రదర్శనా కుతూహలంతో మాత్రం కాదన్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న కుల ఉద్యమాలు, వర్గ పోరాటాలు, రాజకీయ అణచివేతల నడుమ నా భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడిపడి ఉందన్నారు. నా మీద ఏదైనా దాడి జరిగితే ప్రజాజీవితంపై అది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని పవన్ ఆ లేఖలో హెచ్చరించారు. గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే అభిమానులు ధర్నా చేశారని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.

 

ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట ఘటన దృష్ట్యా భద్రత కోరుతున్నానని పవన్ లేఖలో పేర్కొన్నారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని జనసేనాని స్పష్టం చేశారు.

Tags : AP DGPgunturjanasena party chiefletter to dgppawan kalyansafetysecuritywarning

Also read

Use Facebook to Comment on this PostMenu