05/19/19 11:55 AM

పవన్ కళ్యాణ్‌కి గుడ్ న్యూస్ వినిపించిన లగడపాటి రాజగోపాల్

Pawan Kalyan Will Win, Says Lagadapati Rajagopal

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సర్వేల స్పెసలిస్ట్ లగడపాటి రాజగోపాల్ గుడ్ న్యూస్ వినిపించారు. లగడపాటి జోస్యం జనసేన శ్రేణుల్లో ఆనందం నింపింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది.. ఆ పార్టీ అధినేత పవన్ పరిస్థితి ఏంటి.. కింగ్ మేకర్ అవుతారా.. అనే ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో లగడపాటి చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్లో ఆనందం నింపాయి. ఎన్నికల్లో ఘన విజయంతో ఏపీ అసెంబ్లీలోకి పవర్ స్టార్ కచ్చితంగా అడుగుపెడతారని లగడపాటి చెప్పారు. అయితే ఏ స్థానం నుంచి పవన్ గెలుస్తారు అనేది చెప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కు చిన్నతమ్ముడు కాబట్టి కాస్త తక్కువలోనే ఉంటాడని అనడం ద్వారా జనసేనకి పెద్దగా సీట్లు రావన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ కంటే పవర్ స్టార్‌ జనసేనకి తక్కువ సీట్లు వస్తాయని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? ఆ పార్టీ వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో పవన్ ప్రభావం కచ్చితంగా ఉంటుందని లగడపాటి తేల్చి చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కంటే పవర్ స్టార్ ప్రభావం కాస్త తక్కువగానే ఉన్నా… గత ఎన్నికల కంటే ఎక్కువ ప్రభావం చూపించనున్నారని చెప్పారు. 2014లో ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా తక్కువగా ఉందని.. కానీ ఈసారి పవన్ వల్ల ఆ వ్యత్యాసం మరింత పెరగనుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలకమయ్యే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్న వేయగా.. చిరంజీవి పార్టీ కంటే పవన్ పార్టీకి తక్కువ సీట్లే వస్తాయన్నారు. జనసేన 16 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు.

జనసేన రాకతో టీడీపీ, వైసీపీలకు ఓటింగ్ శాతం తగ్గిందని లగడపాటి వెల్లడించారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో హంగ్ రాదని, ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని లగడపాటి స్పష్టం చేశారు. కచ్చితమైన మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత కచ్చితమైన సంఖ్యలతో తిరుపతిలో సర్వే ఫలితాలు వెల్లడిస్తానని తెలిపారు. ఎవరు గెలుస్తారన్నది కాదని, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడమే తన ప్రతిష్ఠకు తగిన వ్యవహారం అని లగడపాటి స్పష్టం చేశారు. మొత్తంగా కచ్చితమైన మెజార్టీతోనే ఏపీలో ప్రభుత్వం వస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇస్తున్నారని లగడపాటి గుర్తు చేశారు.

Tags : ap electionschandrababu naidujanasenaLagadapati rajagopalpawan kalyansurveyYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu