01/21/18 5:34 PM

పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తేసిన పోలాండ్ అంబాసిడర్..!

Untitled-1 copy

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తారు పోలాండ్ రాయబారి ఆడమ్ బురాకో వస్కీ. పవన్ కల్యాణ్ బ్రిలియంట్ అంటూ కితాబిచ్చారాయన. భారతీయ సినీ రంగంలోని గొప్ప నటుల్లో పవన్ ఒకరని ప్రశంసించారు. పవన్‌తో మాట్లాడినప్పుడు తాను ఒక విషయాన్ని గుర్తించాని… పవన్ గొప్ప తెలివైన వ్యక్తని, ఆయన మనసులో మంచి మంచి ఆలోచనలు ఉన్నాయని ఆడమ్ అన్నారు.

 

వివరాల్లోకి వెళితే.. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకో వస్కీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసారు. ఈ ఉదయం జనసేన కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. పోలాండ్ దేశానికి చెందిన మరో 20 మంది విద్యార్థులు కూడా పవన్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ వారితో పలు అంశాలపై మాట్లాడారు.

 

గత నవంబర్ లో పవన్ ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఆయనను పలువురు పోలాండ్ వాసులు కలిశారు. పోలాండ్ వాసుల ద్వారా పవన్ గురించి తెలుసుకున్న అక్కడి అంబాసిడర్.. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పవన్ తో భేటీ అయ్యారు.

 

పోలాండ్ తో భారత్ కు ఎంతో సానిహిత్యం ఉందని ఈ సందర్భంగా పవన్ అన్నారు. చాలా సినిమాలను ఆ దేశంలో షూట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణాదిన పోలాండ్ సినిమాలు షూట్ చేసుకోవలసిన అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కాగా చదువులో తాను ఫెయిల్ అయ్యాయని, బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్ అయి ఉండేవాడినని పోలాండ్ విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా పవన్ చెప్పారు.

 

ఈ భేటీ సందర్భంగా పవన్, ఆయన భార్య అన్నా లెజ్ నోవాలకు.. ఆడమ్ దంపతులు బహుమతులు అందజేశారు.. తర్వాత పవన్ భార్య అన్నా వారిద్దరికీ బహుమతులను అందించారు. అనంతరం కొద్ది మంది ప్రత్యేక ఆహ్వానితులు, విదేశీ విద్యార్థులతో పవన్, ఆడమ్‌ లు ముచ్చటించారు. ఈ సమయంలో తనకు హిందీ వచ్చని చెప్పిన ఆడమ్… హిందీలోనే మాట్లాడారు. అంతేకాదు ‘ప్యార్ హువా’ అంటూ బాలీవుడ్ పాటను ఆలపించి ఆశ్చర్యం కలిగించారు. దీంతో, పవన్ సహా అందరూ కరతాళధ్వనులతో అభినందించారు. ఇక పోలాండ్‌ లో సినిమా షూటింగ్ లు చేయాలని, అందుకు పవన్ సహకరించాలని ఆడమ్ కోరగా.. అందుకు పవన్ ఓకే చెప్పారు.

55

Tags : janasena partypawan kalyanPoland ambassador adam burakovskyPoland studentspower starpraises pawan kalyan

Also read

Use Facebook to Comment on this Post



Menu