03/13/19 11:48 AM

వలసల వెల్లువ : రోజురోజుకి బలపడుతున్న జగన్

Potluri Vara Prasad Joins YSRCP

ఎన్నికల వేళ ఏపీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు, కీలక వ్యాక్తులు జగన్ పార్టీలోకి క్యూ కట్టారు. ఇటీవలే నటుడు అలీ సహా పలువురు సినీ ప్రముఖులు వైసీపీలో చేరారు. తాజాగా ప్రముఖ వ్యాపారావేత్త, నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి (పీవీపీ) కూడా వైసీపీలో చేరారు. జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ కు రాష్ట్ర అభివృద్ధిపై మంచి విజన్ ఉందని, 25ఏళ్ల విజన్ పెట్టుకున్నారని, అది నచ్చే వైసీపీలో చేరానని తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు, పుట్టి పెరిగిన విజయవాడను మరింత అభివృద్ది చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని పీవీపీ చెప్పారు.
జగన్ ఏ బాధ్యత ఇచ్చినా చేసేందుకు సిద్ధమన్నారాయన. విజయవాడ ప్రాంతంలో రాజధాని లేని సమయంలోనే తానెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే, మరింత అభివృద్ధిని చూపిస్తానని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎక్కువ ఆదాయం ఏపీ నుంచి వస్తుందన్న సంగతి ఓ నిర్మాతగా తనకు తెలుసునని, సినిమా చిత్రీకరణలు ఎక్కడ తీసుకున్నా, పెద్ద సినిమాల ఫంక్షన్లు ఏపీలోనూ నిర్వహించేలా నిర్మాతలతో తాను చర్చిస్తానని అన్నారు. సినీరంగానికి చెందిన కార్యక్రమాల్లో హైదరాబాద్, విజయవాడకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పరిశ్రమకు సూచించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో తాను విజయవాడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నానని, తనను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని పీవీపీ అన్నారు.

 

ఈ రోజు తనతో పాటు తన కుటుంబానికి అత్యంత ప్రధానమైన రోజు అని పీవీపీ అన్నారు. ఇన్నాళ్లు పారిశ్రామికరంగంలో ఉన్న తాను ప్రజా జీవితంలోకి ప్రవేశించానని తెలిపారు. విజయవాడ అభివృద్ధే తన అజెండా అని.. రాజకీయాలు తన ఉద్దేశ్యం కాదని పీవీపీ స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో తాను మేయర్‌గా పనిచేశానని.. రాజశేఖర్‌రెడ్డి పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే జగన్ సీఎం కావాలని విజయవాడ నగర మాజీ మేయర్ రత్నబందు అన్నారు. పీవీపీతో పాటు కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన కుటుంబసభ్యులు, విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు, సినీనటుడు రాజా రవీంద్ర తదితరులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

2014 ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంటు స్థానంపై మక్కువ పెంచుకున్న పీవీపీ అప్పట్లో జగన్ నుంచి సరైన హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో పార్టీలో చేరికను వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎన్నికలు రావడంతో పీవీపీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బెజవాడ టికెట్ పై ఈసారి స్పష్టమైన హామీ రావడంతో పార్టీలో చేరిపోయారు.

Tags : joins ysr congress partyloksabhapotluri vara prasadpvpthota narasimhamvijaywadays jagan

Also read

Use Facebook to Comment on this PostMenu