06/10/19 9:34 PM

జనసేన ఓటమికి కారణమిదే : జనసేనానిపై మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

Ravela Kishore Babu Sensational Comments On Pawan Kalyan

జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో జనసేన ఓటమికి కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆదర్శాలు చాలా మంచివి అంటూనే.. పవన్ ని దెబ్బకొట్టేలా మాట్లాడారు. సమాజంలో మార్పు తేవాలన్న తపన చాలా మంచిదని.. అవినీతి రహిత పరిపాలన పవన్ ఆశయమన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం లేకుండా ఎన్ని మాటలు చెప్పినా వృథానే అన్నారు. అధికారం సాధించడంలో జనసేన విఫలమైందని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య ఒప్పందం ఉందని ప్రజలు నమ్మారని రావెల చెప్పారు. ‘జనసేనకు ఓటు వేస్తే.. టీడీపీకి వేసినట్లే.. ఓటు వేస్ట్ అవుతుంది.. మళ్లీ అవినీతి టీడీపీకి పట్టం కట్టాల్సి వస్తుందని.. చంద్రబాబును, అవినీతి పరిపాలనను అంతం చేయడానికి వైసీపీని గెలిపించారని’ రావెల అన్నారు.

 

పవన్ ఎప్పుడూ తన సలహాలు, సూచనలు తీసుకోలేదని రావెల ఆరోపించారు. తనకు అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేవాళ్లు కాదని.. కనీసం ఫోన్లో కూడా మాట్లాడే వారు కాదని ఆరోపించారు. పైకి మాత్రం సన్నిహితంగా కనిపించినా.. రాజకీయపరమైన వ్యూహాలు చర్చించడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. కనీసం సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని.. అందుకే ఎన్నికల్లో ఓటమి తప్పలేదన్నారు. పార్టీ బలోపేతానికి పవన్ ఏనాడూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. పార్టీని నడపటంలో పవన్ ఫెయిలయ్యారని రావెల తేల్చేశారు. టీడీపీని వీడి జనసేనలో చేరిన అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ నుంచి రావెల బయటకు వచ్చేశారు. దీనికి గల కారణాలపై రావెల స్పందించారు. జనసేన కీలక నేతల్లో తాను కూడా ఒకడిని అన్న వార్త అవాస్తవమని అన్నారు.

Tags : BJPchandrababujanasenapawan kalyanravela kishore babuTDP

Also read

Use Facebook to Comment on this PostMenu