01/22/18 9:25 PM

వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు

Untitled-1 copy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీతో దోస్తీకి తాము సిద్దంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మరో ఆలోచన లేకుండా బీజేపీతో కలిసి పని చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ కి ప్రత్యేక హోదా ఇస్తేనే.. అని జగన్ ఓ కండిషన్ పెట్టారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేస్తున్న పాదయాత్ర 900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానెల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా జగప్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్య ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు కాలేదని అన్నారు.

 

ఏపీకి ప్రత్యేక హోదా సాధన అంశంపై మొదట్నుంచి కూడా వైసీపీ పోరాటం చేస్తోంది. విభజన హామీల్లో భాగంగా ఏపీకి ఇస్తామన్న స్పెషల్ స్టేటస్ ను ఇవ్వాల్సిందేనని.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్రాన్ని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తుకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags : andhra pradeshBJPpm modipraja sankalpa yatraready to go with bjpspecial statusYs jagan mohan reddyysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu