05/18/18 2:57 PM

దూకుడు మీదున్న బీజేపీకి భారీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

Untitled-1 copy

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి మధ్య పోరాటం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దూకుడు మీదున్న బీజేపీకి దేశ అత్యున్నత న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. బీజేపీ కాళ్లకు బంధం వేసేలా ఆదేశాలు ఇచ్చింది. కమలదళానికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అంతకుముందు బీజేపీ ప్రభుత్వానికి బలపరీక్షకు గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చిన విషయం విదితమే.

 

కాగా, బల నిరూపణకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గి కోరినప్పటికీ.. సుప్రీం తోసిపుచ్చింది. రేపు బలపరీక్షను ఎదుర్కోవడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటని? రోహత్గీని.. ధర్మాసనం ప్రశ్నించింది. బలపరీక్షను రేపు ఎదుర్కోవాల్సిందేని ఆదేశించింది.

 

సుప్రీం కోర్టులో వాదనల సమయంలో రేపే ఫ్లోర్ టెస్టుకు మీరు సిద్ధమా? అని ధర్మాసనం అడిగితే, కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించింది. బీజేపీ మాత్రం వారం రోజుల సమయం అడిగింది. అయితే ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేల బలం ఉంటే శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బలం నిరూపించుకోవాలని సూచించింది. ఫ్లోర్ టెస్టుకు సెక్యూరిటీని పర్యవేక్షిస్తామని తెలిపింది. ఈ మేరకు సరైన భధ్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

 

ఇదొక్కటే కాదు.. బీజేపీకి సుప్రీంకోర్టు మరిన్ని షాకులిచ్చింది. బలపరీక్షను సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహత్గీ కోరగా.. దానిని కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. చేతులను పైకి ఎత్తడం ద్వారా ఎమ్మెల్యేలు తమ మద్దతును తెలపాలని… ఎమ్మెల్యేల సంఖ్యను ప్రొటెం స్పీకర్ లెక్కించాలని స్పష్టం చేసింది. మరోవైపు, యడ్యూరప్ప ఫ్లోర్ టెస్టులో నెగ్గే వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్లో ఇండియన్ నియామకాన్ని కూడా నిలిపివేసింది. వెంటనే తాత్కాలిక స్పీకర్‌ ను నియమించాలని, ఎటువంటి పదవుల్లోనూ నాయకులను నియమించవద్దని ధర్మాసనం తేల్చి చెప్పింది.

 

కాగా.. ఎమ్మెల్యేలు ఎలాంటి భయం లేకుండా ఓటేసేలా వారికి రక్షణ కల్పించాలని, బలనిరూపణ ప్రక్రియను వీడియో తీయాలని కాంగ్రెస్ లాయర్ అభిషేక్ సింఘ్వీ కోరారు. అయితే వీడియో తీయాలనే కోరికను న్యాయస్థానం తిరస్కరించింది.

 

కాగా.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి మెజార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ గవర్నర్ ఎక్కువ సీట్లు గెలుపొందిన బీజేపీ(104)ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో ఇది అన్యాయం అంటూ.. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాయి. యెడ్డీ ప్రమాణ స్వీకారానికి ముందు.. గవర్నర్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించలేమని చెప్పిన అత్యున్నత ధర్మాసనం.. తాజాగా శుక్రవారం ఉదయం ఆ పార్టీల పిటీషన్‌ ను మరోసారి పరిశీలించింది. ఈ క్రమంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలు హాజరుకాని పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలిస్తామని పేర్కొంది. శాసనసభలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

 

మొత్తంగా ఫ్లోర్ టెస్టుతో కర్ణాటకలో రాజకీయ డ్రామాకు శనివారం తెరపడనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో సంతోషాన్ని నింపగా, బీజేపీ నాయకుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టు అయింది.

Tags : BJPCONGRESSjdsKumaraswamymodiSupreme court gives shock to bjpsupreme court orders floor test in Karnatakayeddyurappa

Also read

Use Facebook to Comment on this Post



Menu