06/16/19 9:02 PM

సీఎం జగన్ ని ఇరుకునపడేసిన మంత్రి : సీఎం జగన్ నిజస్వరూపం బయటపడిందన్న టీడీపీ

TDP Cash Deputy Minister Pushpasrivani Tongue Slip Video

మాటలను జాగ్రత్తగా వాడాలి. రాజకీయ నాయకులైతే మరీ కేర్ ఫుల్ గా ఉండాలి. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇమేజ్ డ్యామేజ్ అవడం ఖాయం. వారు ఇబ్బందుల్లో పడటమే కాకుండా పార్టీని కూడా ట్రబుల్స్ లో పడేసినట్టు అవుతుంది. తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అలాంటి చేదు అనుభవాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి నోరుజారు. అవినీతి పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పి విమర్శల పాలయ్యారు.

 

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సొంత జిల్లా విజయనగరంకు వచ్చిన పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తడబడ్డారు. “మా ముఖ్యమంత్రి ఒకటే లైన్‌తో వెళుతున్నారు. అవినీతి పాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం” అంటూ పుష్పశ్రీవాణి వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలతో మీడియా వారే కాదు.. మంత్రి పక్కన ఉన్న నేతలు, సిబ్బంది, అధికారులు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని తప్పుని ఎత్తిచూపారు. దీంతో మంత్రి అలర్ట్ అయ్యారు. తన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు మంత్రి మాటలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

 

ప్రభుత్వం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న టీడీపీ.. శ్రీవాణి వీడియోని క్యాష్ చేసుకునే పనిలో పడింది. ‘మీ వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం. మీరు నిజమే చెప్పారు. మీ ప్రభుత్వం లక్ష్యం ఏంటో చెప్పినందుకు ధన్యవాదాలు..’ అని టీడీపీ ఎద్దేవా చేసింది.

Tags : corruptionpushpasrivaniTDPtongue slipYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu