06/13/19 9:43 PM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్

TDP Finish, Ap CM Jagan Warns Chandrababu

ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ లోనే వాడీవేడిగా మొదలయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నిక తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుని జగన్ ఏకిపారేశారు. సభా సంప్రదాయం, విలువలు, పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైఖరిని కడిగేశారు. గతంలో చంద్రబాబు చేసినట్టు నేను చేయను అన్నారు. చంద్రబాబులా అన్యాయం చేయను అని జగన్ స్పష్టం చేశారు. టీడీపీ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను మేం తీసుకుంటే రాజీనామా చేయించే తీసకుంటాము అని తేల్చి చెప్పారు. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న జగన్… వారిలోంచి ఐదుగురిని లాగేస్తే.. ప్రధాన ప్రతిపక్షం హోదా ఉండదన్నారు. కానీ తాను అలా చేయను అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే.. తనకు, చంద్రబాబుకు తేడా ఉండదన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలను తీసుకోవాలనుకుంటే.. వారితో రాజీనామా చేయించిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామని జగన్ తేల్చి చెప్పారు. అంతేకానీ చంద్రబాబులా అడ్డదారిలో వెళ్లను అన్నారు.

 

తాను కూడా చంద్రబాబులా రాజకీయాలు చేస్తే.. ఇవాళ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సభలో కూర్చునే వారు కాదని సీఎం జగన్ అన్నారు. ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. తనతో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను డోర్ తెరిస్తే.. చాలామంది రావడానికి రెడీగా ఉన్నారని బాంబు పేల్చారు. నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని జగన్ వార్నింగ్ ఇచ్చారు.

 

సంతలో పశువుల్ని కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను నాడు చంద్రబాబు కొనుగోలు చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలను, అన్యాయాన్ని.. దేవుడు, ప్రజలు గనమించారని… ‘గూబ గుయ్’ మనేలా దేవుడు, ప్రజలు తీర్పు చెప్పారని జగన్ అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలని చంద్రబాబు కొనుగోలు చేశారో.. అంతమంది మాత్రమే టీడీపీకి మిగిలారని చెప్పారు.

 

చంద్రబాబు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని సీఎం జగన్ మండిపడ్డారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చట్టానికి తూట్లు పొడిచారని, స్పీకర్ పదవిని దుర్వినియోగం చేశారని జగన్ ఆరోపించారు. ఈ అన్యాయమైన సంప్రదాయం కొనసాగకూడదని, చట్టసభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని.. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కొనసాగాలని.. మంచి సంప్రదాయం రావాలని జగన్ ఆకాంక్షించారు. దేవుడు, ప్రజలు ఇచ్చిన తీర్పు చూశాకైనా.. చంద్రబాబు మారాలని జగన్ కోరారు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు మాట్లాడే మాటలు చూస్తుంటే కుక్క తోక ఎప్పుడూ వంకరే అని జగన్ విమర్శించారు.

Tags : ap assemblyap cm jaganchandrababudefectionsmlasresignationtammineni sitaramys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu