08/9/18 9:29 PM

పార్లమెంటు సాక్షిగా జగన్ నిజస్వరూపం బయటపడింది..!

Untitled-1 copy

ఏపీకి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తీరా.. ఓటింగ్ సమయానికి సైలెంట్ అయిపోయింది. ఓటింగ్ కు దూరంగా ఉండిపోయింది. దీంతో వైసీపీ తీరుపై అధికార టీడీపీ ఫైర్ అయింది. జగన్ పై టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటు సాక్షిగా జగన్ నిజస్వరూపం బయటపడిందన్నారు. జగన్.. బీజేపీతో చేతులు కలిపారు అని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు.

 

బీజేపీతో లాలూచీ పడ్డ ఓ పార్టీ ఓటు వేయకుండా పారిపోయిందని వైసీపీని ఉద్దేశించి ఏపీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు విసిరారు. యూటర్న్ తీసుకోవడంలో జగన్ సిద్ధహస్తుడని, యూటర్న్ బోర్డులు ఉన్న చోట జగన్ ఫొటో పెట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సి వస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓటేయకుండా వైసీపీ తప్పుకుందని విమర్శించారు.

 

పార్లమెంటు సాక్షిగా బీజేపీ-వైసీపీ బంధం మరోసారి బయటపడిందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ పాల్గొనకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

Tags : modindarajya sabha deputy chairman pollTDPys jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu