07/15/19 11:25 AM

టీడీపీకి ఏమైంది? రోడ్డున పడి కొట్టుకుంటున్న తమ్ముళ్లు

TDP Image Damage, Leaders Tweets War

ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఏమైంది. టీడీపీ ప్రతిష్ట దిగజారిపోయిందా? తమ్ముళ్లలో క్రమశిక్షణ లోపించిందా? అన్నగారు స్థాపించిన పార్టీ ప్రాభవం కోల్పోయిందా? ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అభిమానులను, కేడర్ ను మరింత బాధిస్తున్నాయి. ఓవైపు వలసలు, మరోవైపు సొంత పార్టీ నేతల కుమ్ములాటలు.. అసలు టీడీపీకి ఏమైంది? అని చర్చించుకుంటున్నారు.

 

టీడీపీ నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ట్వీట్లు చేస్తున్నారు. ఒకాయన ఏమో నువ్వు మోసగాడివి అంటాడు.. మరొకాయన ఏమో నువ్వు గుళ్లో కొబ్బరి చిప్ప దొంగ, సైకిల్ బెల్లుల దొంగ, కాల్ మనీ గాడివి అంటాడు.. అసలు టీడీపీ నాయకులకు ఏమైంది? ఎందుకిలా రోడ్డు పడి కొట్టుకున్నారు? వారిని చంద్రబాబు ఎందుకు కంట్రోల్ చెయ్యలేకపోతన్నారు? అనేది టీడీపీ హాట్ టాపిక్ గా మారింది.

 

టీడీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బుద్దా వెంకన్న మధ్య ట్వీట్ వార్ తారస్థాయికి చేరింది. ఇద్దరి మధ్య వివాదం పార్టీ పరువుని గంగలో కలిపేసింది. క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు. అలాంటి పార్టీకి చెందిన నాయకులు ఇలా తీవ్ర స్థాయిలో తిట్టుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో తన వాళ్లకు టికెట్లు ఇప్పించుకోలేకపోయాననే బాధలో ఉన్న ఎంపీ కేశినేని.. చంద్రబాబుపై తిరగబడ్డారు. తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో బుద్దా వెంకన్నతో విభేదాలు తలెత్తాయి. దీంతో బుద్దా వెంకన్నని టార్గెట్ చేస్తూ ట్వీట్లు మొదలుపెట్టారు. నాలుగు అక్షరాలు రాని వాడు, నాలుగు పదాల పలకలేని వాడు కూడా ట్వీట్ చేయడం మొదలు పెట్టాడు అని డైరెక్ట్ గా బుద్దా వెంకన్నని టార్గెట్ చేస్తూ కేశినేని నాటి ట్వీట్ చేశారు. నాలుగు ఓట్లు రాని వాడు నాలుగు పదవులు సంపాదించాడని విమర్శించారు. దీనికి బుద్దా వెంకన్న కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు.. ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా.. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా? అని ఘాటుగా బదులిచ్చారు. అలా ఇద్దరి మధ్య విమర్శల యుద్ధం ముదిరింది.

 

చివరికి నాని, వెంకన్న మధ్య ట్వీట్ వార్ పార్టీ చీఫ్ చంద్రబాబుని తాకింది. నాని.. చంద్రబాబుని కెలికారు. తాను పార్టీలో ఉండాలని భావిస్తే, మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టుకోండి అని నాని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ ట్వీట్ తర్వాత ఏం జరిగిందో కానీ.. బుద్ధా వెంకన్న కాస్త వెనక్కితగ్గారు. నాని ఈ తెల్లవారుజామున పెట్టిన ట్వీట్ కు బదులుగా “బలహీన వర్గాలకు చెందిన నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన చంద్రబాబు గారికి విశ్వాస పాత్రుడిని. దానికి నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఇష్టమే. చంద్రబాబు గారి కోసం, పార్టీ కోసం ఈ ట్వీట్ల యుద్ధం ఆపేస్తున్నా” అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. మరి బుద్ధా వెంకన్న ట్వీట్ తో ఈ వార్ ఆగిపోతుందా? లేక మరో రూపంలో కొనసాగుతుందా? అన్నది చూడాలి.

 

టీడీపీ నేతల మధ్య ట్వీట్ వార్.. పార్టీ పరువుని గంగలో కలిపేసింది. పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది. వ్యక్తిగత విమర్శలతో నేతలు వారి బండారాలు వాళ్లే బయటపెట్టుకున్నారు. అయితే ఇంతజరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏమీ పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆ ఇద్దరిని ఎందుకు అదుపులో పెట్టలేకపోతున్నారు? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీకి ఏమైంది? అని తమ్ముళ్లు ఆలోచనలో పడిపోయారు. అంతా తెలిసి కూడా చంద్రబాబు ఏమీ పట్టనట్టుగా సైలెంట్ గా ఉన్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో అసలే అసెంబ్లీలో జగన్ పార్టీ వాళ్లు చంద్రబాబుని రౌండప్ చేసి ఓ ఆట ఆడుకుంటున్నారు. వారి నుంచి డిఫెండ్ చేసుకోవడానికే చంద్రబాబుకి టైమ్ లేదు.. ఆయన మైండ్ వేడెక్కిపోయి ఉంది.. ఇక పార్టీ నేతల కీచులాటలను ఏం పరిష్కరిస్తారు.. అని వైసీపీ నాయకులు అంటున్నారు.

 

అదే సమయంలో టీడీపీ నేతల మధ్య తగువు.. ప్రజల్లో ఆ పార్టీని మరింత చులకన చేసిందనే అభిప్రాయమూ లేకపోలేదు. మీలో మీకే సఖ్యత లేదు ఇక రాష్ట్ర ప్రజలను ఏమి బాగు చేస్తారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంతోనే ముందుగానే ఊహించి రాజ్యాధికారం జగన్ గారికి కట్టబెట్టారు అని కామెంట్స్ చేస్తున్నారు. మీకే ముక్కు సూటిగా ప్రశ్నించే ధైర్యం లేదు ఇక ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారు అని నిలదీస్తున్నారు. మొత్తంగా కేశినేని నాని పుణ్యమా అని.. టీడీపీ పరువు గంగలో కలిసింది.

Tags : ap cm ys jaganbudda venkannachandrababukesineni naniTDPtweet war

Also read

Use Facebook to Comment on this PostMenu