07/13/19 9:31 PM

బీజేపీలోకి భారీగా చేరికలు.. 8మంది టీడీపీ ఎమ్మెల్యేలు జంప్

TDP Leaders To Join BJP

ఏపీలో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏపీలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇతర పార్టీల నేతలను లాక్కోవడంపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టీడీపీ నేతలపై. ఎన్నికల్లో దారుణ ఓటమితో డీలాపడిపోయిన తమ్ముళ్లను తమ పార్టీలోకి లాగేందుకు బీజేపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. టీడీపీలో కీలకమైన, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నేతలనే టార్గెట్ చేసింది.

 

ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించారు. రాజేశ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో వీరంతా రేపు బీజేపీలో చేరుతారని తెలిపారు. టీడీపీ త్వరలోనే ఖాళీ అయిపోతుందని కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. 8మంది టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో బీజేపీ కండువా కప్పుకుంటారని, టీడీపీ శాసనభాపక్షం కూడా బీజేపీలో విలీనం అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఏయే నేతలు బీజేపీలో చేరబోతున్నారో వేచి చూడాలని మీడియాకు సూచించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు.

 

త్వరలో టీడీపీ బీజేపీలో విలీనం అవుతుందని టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కన్నా స్పందించారు. మోడీకి చంద్రబాబుతో ఎలాంటి అవసరాలు ఉండవన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని, ఏపీలో బీజేపీ ప్రధాన పార్టీలో అవతరించబోతోందని కన్నా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ బడ్జెట్ కాగితంపై బాగానే ఉన్నప్పటికీ, అమలులో కనిపించబోదని అన్నారు. చంద్రబాబు తరహాలోనే ఏపీ సీఎం జగన్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనిషని, ఆయన్ను ఎవ్వరితోనూ పోల్చలేమని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెబుతున్న మాటలు, హామీలను చేతల్లో చూపించాలని కన్నా డిమాండ్ చేశారు. టీడీపీ భూస్థాపితం అవుతుంది అంటూ కన్నా గారు చెప్పింది నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags : BJPchandrababujoiningskanna lakshminarayanamergemodiTDP

Also read

Use Facebook to Comment on this PostMenu