07/2/19 12:54 PM

చంద్రబాబుకి మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ నేతలు

tdp-leaders-to-join-ysrcp

చంద్రబాబుకి మరో షాక్ తగలనుందా? టీడీపీ నుంచి వలసలు కంటిన్యూ అవుతాయా? టీడీపీ నేతలు అధికార పార్టీవైపు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లేందుక రెడీగా ఉన్నారట. జగన్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారట. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.. కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా పార్టీ మారాలని అనుకోవడానికి కారణాలు లేకపోలేదు.

 

ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటుంది. ఈ ఐదేళ్లలో తమ పనులను చేసుకోవాలన్నా.. రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్నా.. వైసీపీలో చేరడం మినహా మరో మార్గం లేదని భావిస్తున్నారట. మరోవైపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. దీంతో టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఆలోచనలో పడ్డారట. స్థానిక ఎన్నికలు వచ్చేలోగా, వైసీపీలో చేరాలని ఎంతో మంది నేతలు ప్లాన్ చేసుకుంటుంటే, వారికి జగన్ నుంచి అనుమతి మాత్రం రావడం లేదట. తమ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా ఆగాలని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు చెబుతుండటంతో ఏం చేయాలో అర్థంగాని స్థితిలో వలస నేతలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పటికే వైసీపీలో కొనసాగుతున్న స్థానిక నేతలతో టచ్ లో ఉన్న టీడీపీ లోకల్ క్యాడర్, వలస వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారిని ఆహ్వానించేందుకు మాత్రం వైసీపీ సిద్ధంగా లేదట. మరో రెండు రోజుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల పదవీ కాలం ముగియనుండటంతో వేలాది మంది రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. ఈ సమయంలో వైసీపీలో చేరితేనే తమకు లబ్ది కలుగుతుందన్నది టీడీపీ నేతల అంచనా. ఆ పార్టీలో చేరేందుకు పైరవీలు సాగిస్తూ, ముఖ్య నేతలతో మాట్లాడుతూ, ఎప్పుడంటే అప్పుడు ఫిరాయించేందుకు సిద్ధమని అంటున్నా, వైసీపీ మాత్రం ఇంకా ఓకే అనడం లేదు. ఎన్నికల సమయంలో తటస్థంగా ఉన్న నేతలు సైతం ఇప్పుడు వైసీపీ వైపే చూస్తున్నారని తెలుస్తోంది.

 

ఈ ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి ఎదురైంది. కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలే దక్కాయి. ఫలితాలు దారుణంగా రావడంతో టీడీపీ కేడర్ తీవ్రమైన నిరాశలో ఉంది. ఇక ఇటీవలే పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు, రాజ్యసభ ఎంపీలు, చంద్రబాబు సన్నిహితులు.. బీజేపీలో చేరిపోయారు. మరోవైపు టీడీపీ కాపు నేతలు కాక పెట్టిస్తున్నారు. రహస్య సమావేశాలతో పార్టీలో కలకలం రేపుతున్నారు. ఇటు పార్టీ కార్యకర్తలపై దాడులు, హత్యలు.. ఇలా అన్ని వైపుల నుంచి టీడీపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీలోకి వెళ్లడమే సేఫ్ గా టీడీపీ నేతలు కొందరు భావిస్తున్నారు. మరి పార్టీ అధినేత చంద్రబాబు.. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో, కేడర్ ను ఎలా కాపాడుకుంటారో చూడాలి.

Tags : chandrababujoiningsSHOCKTDPtdp leadersys jaganysr congress partyysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu