05/21/19 7:29 PM

బాబుగారు బతికుండగా అలా జరగనిస్తారా?

TDP Will Break Into Two Parts

బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 23వ తేదీ తర్వాత.. అంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్కలు కాబోతోందని జోస్యం చెప్పారు. నారా టీడీపీ, నందమూరి టీడీపీగా పార్టీ చీలిపోతుందన్నారు. ఒక వర్గం నారా వారి కోసం.. మరో వర్గం ఎన్టీఆర్‌ కుటుంబానికి అండగా ఉంటారన్నారు. రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ తప్పదన్నారు. సైకిల్ పంక్చర్ అయిందని… ఉనికి కోసమే ఇతర రాష్ట్రాల నేతలను చంద్రబాబు కలుస్తున్నారని, జాతీయ రాజకీయాల్లో ఉండేందుకు ఆరాటపడుతున్నారని మాధవ్ విమర్శించారు.

 

బీజేపీతో వైసీపీకి సంబంధం ఉందంటూ చంద్రబాబు చేసిన ప్రచారం చివరికి వైసీపీకి లాభం చేకూర్చిందని అన్నారు. ఏపీలో లగడపాటి చెప్పిన సర్వే నిజమైతే… ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు చంద్రబాబు అంగీకరిస్తారా? అని మాధవ్ ప్రశ్నించారు. రాజకీయాల్లో చంద్రబాబు లాంటి దగాకోరు ఎవరూ లేరంటూ మండిపడ్డారు. జనసేన ఓట్లను చీలుస్తుందని, అది టీడీపీకి లాభిస్తుందనే చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టిందని చెప్పారు. ఏపీలో టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు పార్టీ రెండు ముక్కలుగా విడిపోతుందని చెప్పారు.

 

వైసీపీ గెలవడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. జనసేన.. టీడీపీ ఓట్లు చీల్చిందని అభిప్రాయపడ్డారు. ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ధోరణి దొంగే దొంగా అన్నట్టు ఉందని, డేటా చోరి కేసులో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబును ఎన్నికల సంఘం విచారించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ, బీజేపీ కలిసిపోయాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ చంద్రబాబుకి ధన్యవాదాలు తెలపాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మాధవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని.. తాము ఇంట గెలవకపోయినా రచ్చ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags : bjp mlc madhavbreakchandrababudividejanasenanandamuri tdpnara tdpTDPYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu