05/1/19 1:02 PM

రామ్ గోపాల్ వర్మకి మాజీ హీరోయిన్ ఛాలెంజ్

TDP Women Leaders Challenge Ram Gopal Varma, Ys Jagan

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాలని వర్మ అనుకున్నాడు. అయితే ఏపీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. గన్నవరం ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని హైదరాబాద్ కి పంపేశారు. దీనంతో వర్మ బాగా హర్ట్ అయ్యాడు. ఏపీ ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విరుచుకుపడ్డాడు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించాడు. అంతేకాదు ఎయిర్ పోర్టు లోపలికి ఏపీ పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించాడు. జగన్ పై కత్తి దాడి కేసులో.. ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లే అధికారం మాకు లేదని ఏపీ పోలీసులు, ప్రభుత్వ పెద్దలు చెప్పారని గుర్తు చేసిన వర్మ.. ఇప్పుడు.. తన విషయంలో ఏపీ పోలీసులు ఎయిర్ పోర్టు లోపలికి ఎలా వచ్చారని నిలదీశాడు. నేను విజయవాడకు రాకూడదా? ప్రెస్ మీట్ పెట్టకూడదా? అని ప్రశ్నించారు. ఇది ఏపీనా? నార్త్ కొరియానా? అని కూడా అడిగాడు. వర్మకి వైసీపీ అధినేత జగన్ సపోర్ట్ చెయ్యడం రాజకీయాలను వేడెక్కించింది. ప్రెస్ మీట్ పెట్టకుండా వర్మని అడ్డుకోవడం దారుణం అని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదని జగన్ విమర్శించారు.

 

టీడీపీ ప్రభుత్వంపై వర్మ, జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మహిళా నేత, సినీనటి దివ్యవాణి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ జగన్‌ వాటిపై ఏమాత్రం స్పందించకుండా వర్మకు మద్దతివ్వడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఏపీలో ఫొని తుపాను, తాగు నీటి సమస్యలు.. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించకుండా వర్మకు మద్దతుగా ట్విటర్‌లో జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.

 

ఈ సందర్భంగా వర్మకు ఆమె ఛాలెంజ్ విసిరారు. వర్మకి దమ్ముంటే వైఎస్‌ కుటుంబంలో ఇటీవల జరిగిన హత్యపై(వైఎస్ వివేకానందరెడ్డి) సినిమా తీయాలని సవాల్‌ విసిరారు. జగన్, విజయసాయి రెడ్డి చేతుల్లో వర్మ కీలుబొమ్మ అని ఆరోపించారు. వర్మ సోషల్ మీడియా ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సైతం వర్మ, జగన్ లపై విరుచుకుపడ్డారు. ఆర్జీవీ ఒక సైకో డైరెక్టర్ అని అన్నారు. ఒక సైకో డైరెక్టర్‌కు జగన్ మద్దతుగా నిలవడం విడ్డూరంగా ఉందన్నారు.

Tags : chandrababudivya vanilakshmis ntrram gopal varmaRGVsadineni yaminiYs jagan mohan reddyys vivekananda reddy murder

Also read

Use Facebook to Comment on this Post



Menu