12/7/18 8:26 PM

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది

Telangana Assembly Elections 2018 Exit Polls

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 70శాతం పోలింగ్ నమోదైంది. లాస్ట్ టైమ్‌తో పోలిస్తే పోలింగ్ శాతంలో పెద్దగా మార్పులేదు. గత ఎన్నికల్లో 69శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం విషయానికొస్తే పట్టణాల్లో ఓటింగ్ కాస్త మందకొడిగా సాగగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త పెరిగింది.

 

పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి విజేతలపై పడింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనేది హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ మరోసారి గెలుస్తుందా? ప్రజాకూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలియాలంటే డిసెంబర్ 11 వరకు ఆగాల్సిందే.

 

మరి ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ పార్టీ గెలుస్తుంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టారు? అనే విషయాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రజలు మళ్లీ టీఆర్ఎస్‌నే ఆదరించారు అనేది స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే పట్టం కట్టబోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ చెప్పినట్టు 100సీట్లు రావు. సరికదా 70 సీట్లు కూడా దక్కే పరిస్థితి లేదు. సింపుల్ మెజార్టీతో(60 నుంచి 65) అధికారంలోకి రానుంది అని జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్‌ ట్రెండ్‌ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే అంచనాలు వచ్చాయి. ప్రజాకూటమి పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు పరాభావం తప్పదనిపిస్తోంది. టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, న్యూస్ ఎక్స్, సీఎన్ఎన్-18, ఇండియా టుడే సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని తేలింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 60. సో.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం టీఆర్ఎస్‌కు పెద్ద కష్టమేమీ కాదు.

 

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకారం..
మొత్తం 119 స్థానాలకు గాను 66 స్థానాలను గెలుచుకుని, అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుందని చెప్పింది. మహాకూటమి 37 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. బీజేపీ 7 స్థానాల్లో గెలుస్తుందని, ఇతరులు 9 స్థానాలను కైవసం చేసుకుంటారని చెప్పింది.

 

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్..
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపింది. 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 50 నుంచి 65 స్థానాలను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. మహాకూటమి 38 నుంచి 52 సీట్లలో గెలుపొందుతుందని చెప్పింది. బీజేపీకి 4 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులు 10 నుంచి 17 స్థానాల్లో గెలుపొందుతారని వెల్లడించింది.

 

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్..
టీఆర్ఎస్‌కే అగ్రస్థానం లభించింది. టీఆర్ఎస్‌కు 57, ప్రజాకూటమికి 46, బీజేపీకి 6, ఇతరులకు 10 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

 

సీఎన్ఎన్ – న్యూస్ 18 ఎగ్జిట్ పోల్..
టీఆర్ఎస్‌కే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నట్టు ఈ సర్వేలో వెల్లడించింది. టీఆర్ఎస్‌కు 50-65 స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడింది. ప్రజాకూటమికి 38-52, బీజేపీకి 4-7, ఇతరులకు 8-14 స్థానాలు వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది.

 

మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వంపై మరీ అంత వ్యతిరేకత లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైతు బంధు, పింఛన్లు, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలు ప్రజలను కేసీఆర్‌ వైపు మొగ్గుచూపేలా చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు లభించినంత ఆదరణ ఈసారి దక్కకపోవడం గులాబీ శ్రేణులకు హెచ్చరికలాంటిదే.

Tags : cm kcrexit pollspeoples frontpraja kutamiRepublic TVtelangana assembly elections 2018telangana assembly polls 2018Times Nowtrs win

Also read

Use Facebook to Comment on this Post



Menu