06/13/19 8:08 PM

దటీజ్ జగన్ : అసెంబ్లీ సాక్షిగా తన నిజాయితీ చాటుకున్న సీఎం

That is CM Jagan, Oppose Defections

ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ లోనే వాడీవేడిగా మొదలయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నిక తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుని జగన్ ఏకిపారేశారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. నేను చంద్రబాబులా అన్యాయం చేయను అని జగన్ స్పష్టం చేశారు. టీడీపీ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను మేం తీసుకుంటే రాజీనామా చేయించే తీసకుంటాము అని తేల్చి చెప్పారు. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్న జగన్… వారిలోంచి ఐదుగురిని లాగేస్తే.. ప్రధాన ప్రతిపక్షం హోదా ఉండదన్నారు. కానీ తాను అలా చేయను అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే.. తనకు, చంద్రబాబుకు తేడా ఉండదన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలను తీసుకోవాలనుకుంటే.. వారితో రాజీనామా చేయించిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామని జగన్ తేల్చి చెప్పారు. అంతేకానీ చంద్రబాబులా అడ్డదారిలో వెళ్లను అన్నారు.

 

”చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చూసేందుకు కొందరు ఎమ్మెల్యేలను లాగేద్దామని పార్టీ నేతలు కొందరు చెబితే నేను అంగీకరించలేదు. చంద్రబాబుకి 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. వారిలో ఐదుగురిని లాగేస్తే, ఆయనకు 18 మందే మిగులుతారు. అప్పుడాయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. అలా చేస్తే, నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుంది అన్నాను. అధ్యక్షా…సభ సాక్షిగా చెబుతున్నా.. ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే, వారితో కచ్చితంగా రాజీనామా చేయిస్తాం. రాజీనామా చేయించిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటాం. అలాకాకుంటే, వెంటనే అనర్హత వేటు చేయాలని మీకు విన్నవించుకుంటున్నా అధ్యక్షా” అని జగన్ అన్నారు.

 

గత ప్రభుత్వం సభా సంప్రదాయాలను పట్టించుకోలేదని జగన్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వలేదన్నారు. చంద్రబాబు చట్టానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఈ సభలో విలువలు లేని రాజకీయాలు చూశాము అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతిపక్ష నేతను మాట్లాడినివ్వని దిగజారుడు వ్యవస్థను ఈ సభలో చూశామని వాపోయారు. ఈ సభలో నేను ఎలా ఉండాలా అని ఆలోచించాను అని ఆవేదనగా చెప్పారు. అటువంటి అన్యాయమైన సంప్రదాయాన్ని నేను పాటించను అని జగన్ స్పష్టం చేశారు. నేను కూడా అలానే చేస్తే ప్రజాస్వామ్యానికి ఏం విలువ ఉంటుందని జగన్ అన్నారు. అలాంటి విధానాలను నేను అనుసరిస్తే మంచి అనేదే లేకుండా పోతుందన్నారు. స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే.. స్పీకర్ ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం చూపిస్తుందని జగన్ అన్నారు.

 

పార్టీ ఫిరాయింపుల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింతి. నేను తలుచుకుంటే టీడీపీ ఫినిష్ అవుతుందని జగన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ ప్రభుత్వంలో వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. దీన్ని జగన్ టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎంతమందిని అయితే చంద్రబాబు కొనుగోలు చేశారో.. చివరికి చంద్రబాబుకి అంతమంది మాత్రమే మిగిలారని జగన్ పదే పదే గుర్తు చేశారు.

Tags : ap assemblyap cm jaganchandrababudefectionsmlasresignationtammineni sitaramys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu