10/17/18 1:05 AM

పవన్ కు ఒక్కటీ రాదు.. జగన్ కు 30 కూడా కష్టమే..!

pawan jagan jaleel khan

నేనేందుకు ముఖ్యమంత్రిని కాకూడదు? అంటూ ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోవైపు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్క సీటూ రాదని, జగన్ పార్టీ 30 సీట్లు రావడం కూడా కష్టమే అని టీడీపీ నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జోస్యం చెప్పడం విశేషం.

 

2019 ఎన్నికల్లో తాను కీ రోల్ పోషిస్తానని ఓవైపు పవన్ విశ్వాసంగా చెబుతుంటే.. జలీల్ ఖాన్ ఏమో ఇలా అంటున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కనీసం 18 సీట్లు అయినా వచ్చాయని గుర్తు చేసిన జలీల్ ఖాన్… వచ్చే ఎన్నికల్లో పవన్‌ పార్టీకి కనీసం ఒక్క సీటూ రాదన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో సానుభూతి వల్ల జగన్ పార్టీకి 67 సీట్లు వచ్చాయని, ఈసారి 30 సీట్లు కూడా కష్టమేనని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించడం విశేషం.

 

ధవళేశ్వరం సభలో రాజకీయ వారసత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జలీల్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. పవన్ పై ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. పవన్ పై సెటైర్లు వేశారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. సినిమాల్లో వారసత్వం లేదా? అని ప్రశ్నించారు. సినిమాల్లో వారసత్వం ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఎందుకు ఉండకూడదు? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారు? మీ కుటుంబంలో అంతమంది హీరోలు అయింది వారసత్వంతో కాదా? అని జలీల్ ఖాన్ లాజిక్ గా ప్రశ్నించారు. రాజకీయ కుటుంబంలో వారసుడు రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదని జలీల్‌ఖాన్‌ ప్రశ్నించారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్లే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన విమర్శించారు. పవన్ మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

 

నిన్నటి ‘జనసేన’ కవాతులో పవన్ కల్యాణ్ పై పూల వర్షం కురవడాన్ని ఈ సందర్భంగా జలీల్ ఖాన్ ప్రశ్నించారు. తమది పేద పార్టీ అని చెప్పుకునే పవన్ కల్యాణ్ కు ఆకాశం నుండి పూలు చల్లించుకునేంతటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. పవన్ తన ప్రసంగాల్లో బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని పవన్ కు జలీల్ ఖాన్ హితవు పలికారు.

Tags : Jaleel khanJanasena kavathutdp mla jaleel khan fires on pawan kalyanYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu