01/4/19 5:17 PM

బాబుగారూ.. జగన్‌ని పిలిచే దమ్ము లేదా?

Undavalli Arun Kumar Sensational Comments On Chandrababu

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయాయి. గెలుపే లక్ష్యంగా, ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ఎవరికి వారు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబుని ఇరుకున పడేసేలా ఉండవల్లి కామెంట్స్ చేశారు. కేంద్రంతో పోరాడే విషయంలో పవన్ కళ్యాణ్ తమతో కలిసిరావాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు. చంద్రబాబు వ్యాఖ్యల వెనుక ఉన్న పరమార్థం ఏంటో వివరించారు.

 

చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పవన్‌ను వీక్ చేయడానికి అలా మాట్లాడారని చెప్పారు. పవన్ కలిసిరావాలంటున్న బాబు.. ఆ మాట వైఎస్ జగన్‌ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కర్నాటక, బెంగాల్, ఒడిశా ఇలా దేశం మొత్తం తిరిగి మోడీకి వ్యతిరేకంగా చేసే పోరాటానికి మద్దతు కోరుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో ఉన్న జగన్‌ను ఎందుకు అడగటం లేదని నిలదీశారు. ఏపీకి అన్యాయం జరిగింది, మనం మోడీతో కలిసి పోరాడదామని ఫస్ట్ పిలవాల్సింది జగన్‌నే అని ఉండవల్లి అన్నారు. కానీ చంద్రబాబు ఎందుకు జగన్‌ను పిలవలేదో తనకు అర్థం కావడం లేదన్నారు. సీఎం కుర్చీకి జగన్ కాంపిటిషన్ కాబట్టి ఆయనను పిలవలేదేమో అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు కాంపిటిషన్ కాదని అనుకున్నారేమో.. అందుకే పవన్‌ను కలిసిరావాలని చంద్రబాబు పిలిచారేమో అని ఉండవల్లి చెప్పారు.

 

స్పెషల్ స్టేటస్ విషయంలోనూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా రాదని తేల్చి చెప్పారాయన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏపీకి స్పెషల్ స్టేటస్ రాదని.. ఏపీ దేశంలోనే టాప్‌లో ఉన్నప్పుడు.. కేంద్రం నుంచి రాయితీలు, సహాయాలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాదు అవసరమైతే మళ్లీ మోదీతో చంద్రబాబు కలుస్తారని చెప్పి బాంబు పేల్చారు.

 

చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపైనా ఉండవల్లి ఫైర్ అయ్యారు. అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో అడుగడునా అవినీతి కనిపిస్తోందని విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా శ్వేతపత్రం చర్చకోసం విడుదల చేస్తుంది తప్ప.. తాము ఏం చేసింది చెప్పుకోవడానికి కాదని ఉండవల్లి చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాల్లో వాస్తవాలు చెప్పటం లేదని.. బిజినెస్ సమ్మిట్‌తో ముందు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి.. శ్వేతపత్రంలో మాత్రం రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన పది శ్వేతపత్రాలపై తమకు అనుమానాలున్నాయన్నారు. శ్వేతపత్రాలపై చర్చకు సిద్ధమా? అని చంద్రబాబుకి సవాల్ విసిరారు.

Tags : modipawan kalyansensational comments on chandrababuspecial statusUndavalli Arun Kumarys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu