05/7/19 9:45 PM

చంద్రబాబు దిమ్మతిరిగిపోయే నిజాలు : పోలవరం ప్రాజెక్ట్ గురించి మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Undavalli Arun Kumar Sensational Comments On Polavaram Project

పోలవరం ప్రాజెక్ట్ ని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారం వారం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తున్నారు. త్వరగా నిర్మాణం కంప్లిటీ చేసి నీళ్లు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. కేంద్రం సహకరించకపోయినా తమ నిధులతోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి జనాల్లో క్రెడిట్ సాధించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. జూన్ లో నీళ్లు ఇచ్చే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

 

ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ గురించి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుపై బాంబు వేసినంత పని చేశారు. చంద్రబాబుకి దిమ్మతిరిగే నిజాలు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న లోపాలను, భవిష్యత్ లో ఎదురయ్యే ప్రమాదాలను ఉండవల్లి బట్టబయలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడటంపై అరుణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో ఏదైనా తేడా జరిగి డ్యాం డ్యామేజ్ అయితే రాజమండ్రి కొట్డుకుపోతుందని హెచ్చరించారు. ప్రాజెక్ట్ చుట్టుపక్కలున్న గ్రామాలు తుడిచి పెట్టుకుపోతాయన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరని.. ప్రాజెక్ట్ విషయంలో చాలా దారుణాలు జరిగిపొతున్నాయని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపర్ డ్యాం వల్ల ఎంత మునిగిపోతుంది అనే లెక్కలు లేవన్నారు. ఆ ప్రాంత ముంపు ప్రజలకు న్యాయం చేశారా అని ప్రశ్నించారు. ముంపు ప్రజలకు 30 వేల కోట్లు కావాలని.. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు.

 

పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భూమి కుంగిపోవడం మాములు విషయం కాదన్నారు. దాన్ని సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. వెంటనే నిపుణులను పంపి పరిశీలన చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని అక్కడి అధికారులే స్వయంగా తనకు చెబుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కోణమే అని ఉండవల్లి తేల్చారు. అలాగే ఇండియా-పాకిస్తాన్‌లా, ఆంధ్రా-తెలంగాణ ప్రజలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం లేదంటూ మోడీ వ్యాఖ్యానించడం దారుణమని ఉండవల్లి ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

 

ప్రాజెక్టు నిర్మిస్తున్న స్థలంలో భూమి కుంగిపోవడం సాధారణమైన విషయం కాదని ఉండవల్లి అన్నారు. దీని ప్రభావం ప్రస్తుతం కడుతున్న ‘స్పిల్ వే’పై ఉంటుందని హెచ్చరించారు. ఓ జియాలజిస్టును కూడా పెట్టుకోకుండా ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. జియాలజిస్టులను పిలిచి ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాలని కోరారు. ‘ఇప్పటికైనా మేల్కొంటే కేవలం డబ్బు మాత్రమే పోతుంది. కానీ డ్యామ్ పూర్తయ్యాక వరద వస్తే రాజమండ్రి అనేదే ఉండదు.. మొత్తం కొట్టుకుపోతుంది’ అని వార్నింగ్ ఇచ్చారాయన. అమరావతిలో కట్టిన బిల్డింగ్ లకే లీకేజీలు వచ్చాయనీ, వాటిని సిమెంట్ వేసి సరిదిద్దుకోవచ్చని చెప్పారు. కానీ పోలవరం ప్రాజెక్టు బద్దలైతే, తీవ్ర వినాశనం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వీలవుతుందని తాను చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.300 కోట్ల వ్యయం చాలని, అలాంటిది రూ.1600 కోట్లను తగలేశారని వాపోయారు. పోలవరంలో తేడా వస్తే ఊర్లు మిగలవూ, ప్రజలూ మిగలరని ఉండవల్లి హెచ్చరించారు.

 

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో దుమారం రేపుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ లో తేడా వస్తే రాజమండ్రి మటాష్ అవుతుందని ఉండవల్లి చెప్పడం స్థానిక ప్రజల్లో ఆందోళన నింపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏది పడితే అది వాగరు అని నమ్ముతారు. కొంచెం స్టడీ చేశాక ఆయన ఏ అంశంపైన అయినా మాట్లాడతారని నమ్మకం ఉంది. అలాంటి వ్యక్తి పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పిన మాటల్లో నిజం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా బాబుగారు మేల్కొంటారా? ఉండవల్లి లేవనెత్తిన తప్పులను సరిదిద్దుకుంటారా? రాజమండ్రికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags : chandrababu naidudamdamagedrownearth crackspolavaram projectrajahmundrysensational commentsUndavalli Arun Kumar

Also read

Use Facebook to Comment on this PostMenu