02/1/19 1:31 PM

నో డౌట్ ఇది పోల్ బడ్జెటే : మోదీ భారీ ఎన్నికల వరాలు

Union Budget 2019, Will Modi Become Again PM

ఊహించిందే జరిగిందే. అనుకున్నదే అయ్యింది. ఎన్నికల వేళ ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు. మధ్యంతర బడ్జెట్‌లో భారీగా తాయిలాలు ప్రకటించారు. దేశ ప్రజలకు బంపర్ ఆఫర్లు ఇచ్చారు. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు, వేతన జీవులకు భారీ ఊరట, 60 ఏళ్లు పైబడిన వారికి పించన్.. ఇలా అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునే విధంగా బడ్జెట్‌లో వరాలు కురిపించారు. 2014లో గెలిచిన ఎన్డీయేకు.. ఈ టర్మ్‌కు ఇది చివరి బడ్జెట్. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు.. ఈ నాలుగు నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

 

కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయాల్ బడ్జెట్ సంగతులను వివరించారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆఖరి బడ్జెట్‌ కావడంతో అందరి చూపు దీనిపై పడింది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేస్తారా అని అంతా ఆసక్తిగా చూశారు. చివరికి అనుకున్నట్టే ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు.

 

రైతులకు గుడ్‌న్యూస్ , ఏటా రూ.6వేలు:
రైతులకు, వేతన జీవులకు బంఫర్ ఆఫర్ అనౌన్స్ చేశారు. ముఖ్యంగా రైతులను ప్రసన్నం చేసుకునేందుకు శుభవార్త వినిపించారు. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద కొంత అమౌంట్ ఇవ్వనున్నారు. ఒక్కో రైతుకి ఏడాదికి 6వేల రూపాయలు ఇస్తారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బు జమ అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం ప్రకటించారు. 5 ఎకరాల్లోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ.6వేలు ఆర్థికసాయం అందిస్తారు. రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో ఈ నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తుంది.

 

ఆదాయపన్ను పరిమితి డబుల్:
మధ్యంతర బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది మోడీ సర్కార్. ఆదాయ పన్ను పరిమితిని డబుల్ చేసిది. అంటే రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో 3 కోట్లమంది వేతన, మధ్య తరగతి ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. కొద్ది రోజులుగా బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితి రూ.3 లేదా, రూ.4 లేదా రూ.5 లక్షలుగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు మోడీ సర్కార్ దీన్ని రూ.5 లక్షలుగా చేసింది. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఇకపై ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను 24 గంటల్లో తీసుకోవచ్చనని తెలిపారు. అలాగే హోంలోన్ల పై వడ్డీ మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంచారు.

 

60 ఏళ్లు నిండితే.. రూ.3వేలు:
ప్రధానమంత్రి శ్రయమోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త పింఛన్ పథకాన్ని మోడీ సర్కార్ అనౌన్స్ చేసింది. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ ఇస్తారు. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛన్ వస్తుంది. ఈ పథకం ద్వారా 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు లబ్ది చేకూరనుంది.

Tags : election budgetFARMERSincome tax limitmodino income taxpensionunion budget 2019vows for farmers

Also read

Use Facebook to Comment on this Post



Menu