09/24/18 5:29 PM

వీహెచ్ షాకింగ్ నిర్ణయం..!

vh shocking decision

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీలో పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు(వీహెచ్) అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ నుంచి పక్కన పెట్టడం కంటే తనను చంచల్‌ గూడ జైలులో పెడితే బాగుండేదని వీహెచ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే. తమ పార్టీలోనే కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ వ్యాఖ్యల వేడి తగ్గక ముందే వీహెచ్ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని కలుసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రాణం పోయేవరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని వీహెచ్ స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటమే తన లక్ష్యమని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయను అంటూ వీహెచ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, పార్టీ అధిష్ఠానం తీరుతో మనస్తాపం చెందే వీహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు, వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు.

Tags : electionsnot to contestTelangana Congressvhvhanumantha rao shocking decision

Also read

Use Facebook to Comment on this Post



Menu