07/13/19 8:46 PM

ఏపీ అసెంబ్లీలో సభ్యత, సంస్కారం, మర్యాద లోపించాయా?

Who Is Real Assembly Rowdy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. నవరత్నాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. భారీ కేటాయింపులు చేశారు. బడ్జెట్ గురించి కేటాయింపుల గురించి పక్కన పెడితే… సభలో అప్పుడే రచ్చ మొదలైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. బెదిరింపుల పర్వం కనిపించింది. సంస్కారం, మర్యాద గురించి డిస్కషన్ జరిగింది. రాజీనామా సవాళ్లు కనిపించాయి. అన్నింటికన్నా ముఖ్యంగా సభలో రౌడీయిజం కనిపించింది. అది టీడీపీ వాళ్లు చేసిన రౌడీయిజామా, వైసీసీ వాళ్ల రౌడీయిజమా అనేది ప్రజలే నిర్ణయించాలి.

 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా హాట్ హాట్ గా స్టార్ట్ అయ్యాయి. రైతులకు సున్నావడ్డీ రుణాల అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. రసీఎం జగన్ ఓ రేంజ్ లో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. మీరు 23మందే ఉన్నారు.. మేము 150మంది ఉన్నాం.. మేం తలుచుకుంటే.. మీరు మీ సీట్లలో కూడా నిలబడలేరు అని జగన్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. మాజీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కళ్లు పెద్దవి చేసి ఉరిమి చూస్తే భయపడతా అనుకున్నావా, ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరు.. అని సీఎం జగన్ అన్నారు. అంతేకాదు.. అడ్డంగా దేహాలు పెంచడం కాదు.. కాస్త బుద్ధి, జ్ఞానం కూడా పెంచుకోవాలని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఉద్దేశించి జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

అసలు నీకు నవ్వు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు.. నీ నవ్వు ఆపు అని చంద్రబాబుని ఉద్దేశించి జగన్ అన్నారు. ఇంకా.. టీడీపీ ఎమ్మెల్యేలను జగన్ రౌడీలతో పోల్చారు. అంతా రౌడీలు, గుండాలు సభకు వచ్చారు అని మండిపడ్డారు. తన ప్రసంగానికి అడ్డుతగిలారు అనే కోపంతో టీడీపీ ఎమ్మెల్యేలపై జగన్ ఇలా ఫైర్ అయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చెయ్యలేదని చంద్రబాబుని నానా మాటలు అన్నారు.

 

దీనికి తోడు గాడిదలు కాస్తున్నారా? అని మాజీ సీఎం చంద్రబాబుని ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. ఓ సీనియర్ నాయకుడు, మాజీ సీఎంని పట్టుకుని గాడిద అనడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు తప్పు చేసి ఉండొచ్చు..కానీ అసెంబ్లీలో అలాంటి పదాలు మాట్లాడటం సమంజసం కాదని అంటున్నారు.

 

సీఎం జగన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో అసలు రౌడీలు, గుండాలు ఎవరు? రౌడీళ్లా వ్యవహరించింది ఎవరు? రౌడీయిజం ప్రదర్శించింది ఎవరు? అనే డిస్కషన్ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా బిహేవ్ చేశారని, సీఎం జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తే.. వైసీపీ వాళ్లే దారుణంగా మాట్లాడారని రౌడీల్లా బిహేవ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

 

అసెంబ్లీ అంటే అర్దవంతమైన చర్చలకు వేదిక. బలాబలాలకు, రౌడీయిజానికి కాదు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. వాటికి పరిష్కారాలు కనుగొనాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపడం తప్పు కాదు. గతంలో టీడీపీ నాయకులు రౌడీల్లా బిహేవ్ చేశారు కాబట్టి మేము కూడా అలానే చేస్తామంటే కరెక్ట్ కాదు. అప్పుడు వాళ్లకి వీళ్లకి పెద్ద తేడా ఉండదన్నది ప్రజల అభిప్రాయం. ఇక ముందైనా ఆవేశాలకు వెళ్లకుండా సభ్యులు కంట్రోల్ ఉండి చర్చలు సజావుగా జరిగేలా సహకరించుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.

Tags : abusive wordsap assemblybudgetchallengechandrababucm jaganDonkeywarningswords war

Also read

Use Facebook to Comment on this PostMenu