02/8/19 7:10 PM

చంద్రబాబు, జగన్ చేయని పని చేస్తున్నారు : పవన్‌ గెలుపు ఖాయమేనా

Will Educated Elites Make Pawan Kalyan As CM

ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ వ్యూహలు రచిస్తున్నారు. ప్రత్యర్థులకు తన సత్తా చూపించాలని కసిగా ఉన్నారు. ఇందుకోసం జనసేన పార్టీని బలోపేతంగా తయారు చేస్తున్నారు. అయితే అన్ని పార్టీల్లా కాకుండా పవన్ డిఫరెంట్ గా ముందుకెళ్తున్నారు. కేవలం డబ్బున్న వ్యాపారులు, ప్రజాదరణ ఉన్న నాయకులనే కాకుండా.. విద్యావంతులను, మేధావులను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. పవన్ అలాంటి వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కీలక పదవులు అప్పగిస్తున్నారు.

 

ఈ మధ్యకాలంలో చాలా మంది మేధావులు జనసేనలో చేరారు. వారిలో కొంత మందిని ముఖ్యమైన పదవుల్లో పవన్ కూర్చోబెట్టారు. బీవీ రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణు రాజు, ఏపీజే అబ్దుల్ కలాం సైంటిఫిక్ సలహాదారు పొరాజ్, రిటైర్డ్ డీఐజీ రవికుమార్ మూర్తి, సామాజికవేత్త పుల్లారావు, ప్రొఫెసర్ సుధాకర్ రావు.. ఇలా చాలా మందిని పార్టీలోకి పవన్ ఆహ్వానించారు.

 

విద్యావంతులు, మేధావులకు జనసేన పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తుండటం పట్ల హీరో మంచు మనోజ్ స్పందించాడు. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పవన్ చాలా గొప్ప నిర్ణయం తీసుకునారు, మంచి పని చేస్తున్నారు అని కితాబిచ్చాడు. ప్రజా సేవ చేయడానికి విద్యావంతుల సాయం తీసుకుంటేనే దానికొక విలువ, అర్థం ఉంటుందని మనోజ్ అభిప్రాయపడ్డాడు. పవన్ కళ్యాణ్ సార్ ఇలాంటి చొరవ తీసుకుని వాళ్లపై నమ్మకం ఉంచి, గౌరవంతో జనసేన పార్టీలోకి తీసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది అంటూ మనోజ్ ట్వీట్‌ చేశాడు.

 

మనోజ్ ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ‘ఇదే మేం కోరుకున్నది. కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. థాంక్యూ మనోజ్ అన్న’ అంటూ రిప్లై ఇస్తున్నారు. ‘టీవీల్లో చూపించట్లేదు. మీ ట్వీట్ ద్వారా అయినా కొంతమందికి ఈ విషయం తెలుస్తుంది’ అంటూ జనసైనికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

 

కాగా విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, అనలిస్టులను పార్టీలో చేర్చుకోవడం జనసేనకు ప్లస్ అవుతుందా? వారి కారణంగా జనసేన అధికారంలోకి వస్తుందా? పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags : educated eliteseducationistjanasenamanchu manoj praises pawanpawan kalyanponrajpullaraovishnu raju

Also read

Use Facebook to Comment on this Post



Menu