12/4/18 8:42 PM

పవన్ కళ్యాణ్ అంత సాహసం చేస్తారా? ఆయనకు మద్దతిస్తారా?

Will Pawan Kalyan Support TRS In Telangana Assembly Elections

పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. తెలంగాణలోనూ పవన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనసేనకు కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి రాజకీయాలపై పవన్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలు రావడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేయడం లేదు. పోటీగా దూరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ మద్దతు ఎవరికి అనేది ఇప్పుడు హాట్ క్వశ్చన్. ఏ పార్టీకి మద్దతివ్వాలో తెలియక జనసేన కార్యకర్తలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. పవన్‌కున్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఆయన సపోర్ట్ కోసం ముఖ్యమైన పార్టీలు ఎదురు చూస్తాయి. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంలో జనసేనాని కీ రోల్ ప్లే చేశారనే సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో పవన్ ఎవరికి అండగా నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

 

ఈ అయోమయానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా జనసేనాని తెలంగాణ ఎన్నికలపై ట్వీట్ చేశారు. ఎన్నికలపై జనసేన అభిప్రాయం చెప్పాలని కార్యకర్తలు, జనసైనికులే కాక.. పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు కూడా కోరుతున్నారని.. తెలంగాణ ఎన్నికలపై తమ పార్టీ అభిప్రాయాన్ని ఈ నెల 5న వెల్లడిస్తామని పవన్‌ తెలిపారు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా తమ అభిప్రాయాన్ని పవన్‌తో పంచుకుంటున్నారు. మరి జనసేనాని ఎవరికి మద్దతు తెలుపబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. పవన్ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ మద్దతు కోసం పలు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అంతర్గతంగా మాత్రం టీఆర్ఎస్‌కు పవన్ అనుకూలంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరకంగా పవన్ కళ్యాణ్ ఇటీవల గొంతెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాకూటమికి అండగా నిలబడే అవకాశాలు లేవనే విశ్లేషణ వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపైనా పవన్ నిప్పులు చెరుగుతున్నారు. కాబట్టి ఆ పార్టీకి అండగా ఉండే అవకాశం లేదంటున్నారు. ఇక టీఆర్ఎస్‌కు మాత్రం పవన్ అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే కేసీఆర్‌కు అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఇటీవల కేటీఆర్ కూడా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా తమ పాలనను మెచ్చుకున్నారని చెప్పారు. ఇది కూడా హింట్ అని కొందరు భావిస్తున్నారు. అలా కాకుండా అభిమానులు, తెలంగాణలోని పార్టీ కార్యకర్తలు వారి అభీష్టం మేరకు ఓటు వేయమని చెబుతారా? అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. జనసేనాని ధైర్యం చేసి ఎవరో ఒకరికి మద్దతిస్తారా? లేక ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్‌గా సైడ్ అవుతారా? అనేది చూడాలి.

Tags : janasenaKCRMahakutamipawan kalyanpawan kalyan supportprajakutamitelangana assembly electionstrs

Also read

Use Facebook to Comment on this Post



Menu