01/10/19 10:00 AM

కేసీఆర్ బాటలో జగన్.. ముఖ్యమంత్రి అయిపోతారా

Will This Promise Make Jagan CM

అధికారమే లక్ష్యం. సీఎం సీటే టార్గెట్. లాస్ట్ టైమ్ కొద్దిలో అధికారం పీఠం పోయింది. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో పవర్‌లోకి రావాల్సిందే, ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. ఇదీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఏడాదికిపైగా సుదీర్ఘంగా సాగిన జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. సంచలన ప్రకటనలు, వాగ్దానాలు, హామీలు చేశారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు గుప్పించారు. కాగా జగన్ చేసిన ఓ హామీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలో జగన్ పయనిస్తున్నారా అనే సందేహం కలిగింది. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి రైతు బంధు పథకం చాలా ఉపయోగపడింది. రైతులంతా కేసీఆర్ వైపే నిలిచారు. సరిగ్గా ఇలాంటి పథకమే జగన్ కూడా అనౌన్స్ చేశారు. రైతులను అట్రాక్ట్ చేయడానికి వారిపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న తరహాలో రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రకటించారు.

 

రైతులకు పెట్టుబడి కష్టాలను తీర్చడానికి ఏటా మే లో పెట్టుబడి సాయం అందిస్తామని జగన్ ప్రకటించారు. దీంతో రైతులందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఇన్సూరెన్స్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ‘నవరత్నాలు’ పేరుతో పాదయాత్రలో కొన్ని హామీలు ప్రకటించిన జగన్.. ఇప్పుడు రైతులకు ప్రయోజనకరంగా ఉండే పలు ఆకర్షణీయ కార్యక్రమాలు, పథకాలను ప్రకటించారు. నవరత్నాలతో ప్రతి పేదవాడి ఇంట్లో, రైతన్న ఇంట్లో సంతోషం చూడాలనేది తన తపన అని చెప్పారు.

రైతులకు వరాలు:

* రైతుబంధు తరహాలో ఏపీ రైతులకు రైతు పెట్టుబడి పేరుతో మే నెలలో రూ.12,500 పెట్టుబడి సాయం
* రైతు బీమా తరహాలో వైఎస్సార్ బీమా.. రైతు మరణిస్తే రూ. 5 లక్షల ఆర్థిక సాయం.. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయం
* మండలానికి ఒక శీతల గిడ్డంగి, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
* రైతులకు ఉచిత బోర్లు
* రైతులకు రోజుకు 9 గంటల పాటు ఉచిత కరెంటు
* రైతులకు వడ్డీ లేని రుణాలు
* ప్రతి గ్రామంలో పది మందికి గ్రామ పంచాయతీలో ఉద్యోగాలు
* ప్రతి 50 మంది ప్రజలకు ఒక వలంటీర్.. రూ. 5 వేల గౌరవ వేతనం
* ప్రతి జిల్లాకు సహకార డైరీలు. లీటరుకు రూ. 4 బోనస్. అప్పుడు ప్రైవేట్ డైరీలు కూడా పోటీకి వస్తాయి కాబట్టి రైతులకు మరింత మేలు.
* వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ రద్దు.
* రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి. రాష్ట్రం నుంచి రూ. 2 వేల కోట్లు, కేంద్రం నుంచి రూ. 2 కోట్లతో ఈ రిలీఫ్ ఫండ్. కరవు, తుఫాన్లు * సంభవించినప్పుడు రైతులకు దీని ద్వారా పరిహారం.
* తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు ఒక్కొక్కదానికి రూ. 3 వేల పరిహారం. జీడి తోటలకు చంద్రబాబు సర్కారు ప్రకటించిన రూ. 30 వేల సాయం రూ. 50 వేలకు పెంపు.
* జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి. పోలవరం సహా హంద్రీనీవా, గాలేరు తదితర పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్దప్రాతిపదికన పూర్తి.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా, రైతు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు, నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ ప్రభుత్వాలు రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రధాని మోదీ కూడా ఇలాంటి తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి రైతుల మెప్పు పొంది మళ్లీ ప్రధాని కావాలని స్కెచ్ వేశారు. ఇప్పుడు ఏపీలోని ప్రధాన విపక్ష నాయకుడు కూడా కేసీఆర్ బాట పట్టడం విశేషం. అన్నదాత తన కాళ్ల మీద తాను నిలబడే పరిస్థితి తీసుకొస్తానని జగన్ చెప్పారు. నవరత్నాల్లో జరిగే మేలును ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. నేను సీఎం అయితే మీ జీవితాలను మార్చేస్తానని, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని జగన్ ఇచ్చిన హామీలు మరి ఏ మేరకు ఓట్లు రాలుస్తాయో చూడాలి.

Tags : ap 25 districtsap rythu bandujagan padayatra endsjagan promiseprajasankalpa yatrays jaganys jagan on farmersys jagan sops for farmersysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu