04/16/19 12:13 PM

చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్

YS Jagan Complaints On Chandrababu To Governor

ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ అధినేత జగన్.. గవర్నర్ నరసింహన్ ను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. తమ వాళ్లకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను జగన్ కలిశారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ, అనంతరం శాంతి భద్రతల అంశంపై గవర్నర్‌కు వివరించారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు.

 

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ కంప్లయింట్ చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన జగన్, పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఏపీలో పోలింగ్ రోజున హింసాత్మక సంఘటనలో చోటు చేసుకున్నాయి. పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు యథేచ్చగా దాడులు చేస్తున్నారు. ఈ గొడవల్లో ఇద్దరు చనిపోయారు. వైసీపీ కార్యకర్తలే దాడులకు తెగబడ్డారని టీడీపీ నాయకులు.. టీడీపీ వాళ్లే దాడులు చేశారని వైసీపీ వాళ్లు ఆరోపించుకుంటున్నారు. ఇప్పుడీ మ్యాటర్ ను మరింత వేడెక్కించారు జగన్. చంద్రబాబు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం రాజకీయంగా హీట్ ఎక్కించింది.

Tags : attackchandrababu naiducomplaintGovernor narasimhanlaw and orderys jaganysrcp leaders

Also read

Use Facebook to Comment on this Post



Menu