12/3/18 10:10 PM

చంద్రబాబు దిగజారిపోయారు అనేందుకు ఇదే నిదర్శనం : జగన్

YS Jagan Fires On Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేతులు కలిపిన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ తో కలవడానికి సిగ్గులేదా? అని నిలదీశారు. చంద్రబాబుకు నాడు దెయ్యంలా కనిపించిన సోనియా గాంధీ.. నేడు దేవతలా కనిపించిందా అని ప్రశ్నించారు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడు బద్ద శత్రువైన కాంగ్రెస్‌తో కలవడానికి సిగ్గు లేదా? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు టీఆర్ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించారని.. వారు తిరస్కరించడంతో కాంగ్రెస్‌లో కలిశారని జగన్ విమర్శించారు. పాద‌యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ముఖమంత్రి చంద్రబాబుపై జగన్ ఓ రేంజ్‌లో మండిపడ్డారు.

 

2014 ఎన్నికలప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ‘కాంగ్రెస్’ అని, సోనియా గాంధీ అవినీతి అనకొండ అని చంద్రబాబు విమర్శించారని జగన్ గుర్తు చేశారు. ఆ రోజున అవినీతి అనకొండ అయిన సోనియా గాంధీ, ఈరోజున అందాల కొండ, ఆనందాల కొండ అయిందా? అని ప్రశ్నించారు. ఆ రోజున రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా గాంధీని ‘గాడ్సే’ అన్నారని, ఈరోజున ఆమె ‘దేవత’ అని అంటున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ లాంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పరిపాలిస్తాడా? అని నాడు చంద్రబాబు ప్రశ్నించారని, మరి, ఈరోజున, రాహుల్ గాంధీ మేధావి అని ఆయన అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విలువలకు చంద్రబాబు పాతరేశారని చెప్పడానికి నిదర్శనం.. కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసిపోవడమేనని అన్నారు. ఇదే కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు అవినీతిపాలనపై.. చార్జ్‌ షీట్‌ పేరుతో బుక్‌ రిలీజ్‌ చేసిందని గుర్తు చేశారు. ఈ రోజు సిగ్గులేకుండా తెలంగాణ ఎన్నికల్లో జతకట్టిందన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ము ఇస్తాననగానే కాంగ్రెస్‌ వాళ్లు ఓకే అన్నారని..అక్టోబర్‌లో డీల్‌.. నవంబర్‌లో సీట్లు పంచుకున్నారని విమర్శలు గుప్పించారు.

Tags : jagan srikulamrahul gandhisonia gandhitdp congress allianceYs jagan mohan reddyYS Jagan on Chandrababu

Also read

Use Facebook to Comment on this Post



Menu