05/16/19 6:10 PM

స్పీకర్ దగ్గుబాటి, విద్యుత్ శాఖ మంత్రి రోజా : సోషల్ మీడియాలో వైరల్

YS Jagan Mohan Reddy Cabinet List Goes Viral

7 రోజుల్లో అంటే మే 23వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. టీడీపీ మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందా? వైసీపీ అధికారం దక్కించుకుంటుందా? అనేది తేలిపోనుంది. ఓటర్ దేవుడు ఎవరిని కరుణించాడు అనేది మే 23వ తేదీన తెలిసిపోతుంది. కాగా, ఈసారి టీడీపీ ఓటమి ఖాయం అని, తమ గెలుపు పక్కా అని వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. వైసీపీకి 110కి పైగా సీట్లు వస్తాయని, జగన్ సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇకపోతే.. వైసీపీకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏంటంటే.. జగన్ కేబినెట్.

 

వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ కేబినెట్‌లో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో 26 మందికి జగన్ చోటుకల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ జాబితా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నేతల సీనియారిటీ, సామాజికవర్గాలు, ప్రాంతాల ఆధారంగా పక్కాగా లిస్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ప్రకారం..

 

జగన్ కేబినెట్‌:
ముఖ్యమంత్రి : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు
హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
రోడ్లు, భవనాలు : బొత్స సత్యనారాయణ
భారీ నీటి పారుదల : కొడాలి నాని
మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
స్త్రీ శిశు సంక్షేమం : తానేటి వనితా
పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
వైద్యఆరోగ్యశాఖ : అవంతి శ్రీనివాస్
విద్యాశాఖ : కురసాల కన్నబాబు
బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
న్యాయ శాఖ : వై. విశ్వేశర రెడ్డి
దేవాదాయ : కోన రఘుపతి
పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి
ఐటీ : మోపిదేవి వెంకటరమణ
విద్యుత్ శాఖ : ఆర్. కే. రోజా
మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : గ్రంధి శ్రీనివాస్
కార్మిక, రవాణ : ఆళ్ళ నాని
సాంఘిక సంక్షేమం : కె. భాగ్యలక్ష్మి
వ్యవసాయం : ఆళ్ల రామకృష్ణా రెడ్డి
మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్
టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్
గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి
పరిశ్రమలు : కాకాని గోవర్ధన్ రెడ్డి

 

జగన్ కేబినెట్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ, రోజా, అవంతి శ్రీనివాస్‌కు కీలక మంత్రిపదవులు అప్పచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో అబద్దమో తెలియదు కానీ.. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ కేబినెట్ ఇదే.. అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ లిస్ట్ గురించి వైసీపీ వర్గాలు స్పందించడం లేదు. ధృవీకరించడం కూడా లేదు. రిజల్ట్స్ రాకముందే మంత్రి పదవులపై మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ జాబితాపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆలూ లేదు చూలు లేదు..అనే సామెతను ప్రస్తావిస్తున్నారు. వైసీపీ తీరు కూడా అదే విధంగా ఉందని విమర్శిస్తున్నారు. మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని అంటున్నారు. ఎన్నికల్లో ఈసారి కూడా టీడీపీనే గెలుస్తుందని ధీమాగా చెబుతున్నారు.

Tags : ap electionscabinet listjagan cabinetsocial mediaYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu