08/10/18 9:26 PM

బీజేపీ-టీడీపీల బంధానికి ఇదే సాక్ష్యం-వైఎస్ జగన్

99

అక్రమాస్తుల కేసులో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని నిందితురాలిగా చేరుస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్ ను దాఖలు చేసిందంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. ఆ వార్తలను చూసి షాకయ్యానని ట్వీట్ చేసిన విషయం విదితమే. ఈ విషయమై జగన్ మరోమారు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు జగన్ బహిరంగ లేఖ రాశారు.

 

అసలు న్యాయమూర్తి ఇంకా పరిగణనలోకే తీసుకోని అంశాలు కొన్ని పత్రికలకు ఎలా తెలిశాయి? నాపైనే గాక నా కుటుంబంపైనా ఎందుకు ఇలా బురద జల్లుతున్నారు? అని ప్రశ్నిస్తూ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

 

‘ఈడీ కేసులో నిందితురాలిగా వైఎస్ భారతి’ అంటూ ‘ఈనాడు’లో, ‘ముద్దాయిగా భారతి’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈరోజు ప్రచురించిన వార్తను చూసి నిర్ఘాంతపోయాను. ఫలానా కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిందితురాలిగా చేరుస్తున్నారన్న వార్తను శ్రీమతి భారతి, నేను ఈరోజు ఉదయం ఎల్లో పత్రికలు, సెలెక్టివ్ గా ఒకటి రెండు ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్త చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. జడ్జిగారు పరిగణనలోకి తీసుకున్న తరువాతే చార్జిషీట్ లో ఏముంది? అన్న విషయం మాకైనా, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది జడ్జిగారు పరిగణనలోకి తీసుకోకముందే.. మాకే తెలియకుండా, ఈ విషయం నేరుగా ఈడీ నుంచి కొన్ని పత్రికలకు ఎలా తెలిసింది? వారికి ఎవరు చెప్పారు? మా మీదే బురద చల్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? .. కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచటం మంచిదన్న అభిప్రాయంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నా. బీజేపీ-టీడీపీ ల రహస్య బంధానికి ఇదే సాక్ష్యం. మాకు బీజేపీతో సత్సంబంధాలు ఉండి ఉంటే ఈ విషయం ఇంతవరకు వచ్చేదా?’ అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

Tags : ed charge sheetjagan assets caseys bharathiYs jagan open letter

Also read

Use Facebook to Comment on this Post



Menu