02/6/19 8:49 PM

నన్ను గెలిపిస్తే : వైఎస్ జగన్ మరో సంచలన హామీ

YS Jagan Sensational Promise

2014 ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని, సీఎం అవ్వాలని కసిగా ఉన్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో తిరుమల వెంకన్న సాక్షిగా జగన్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ ద్వారా సమరానికి సై అన్నారు. చంద్రబాబు టార్గెట్‌గా మాటల తూటాలు పేల్చారు. అలాగే నవరత్నాలతో పాటూ కీలకమైన హామీలు ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ నింపే స్పీచ్ ఇచ్చారు. ”అన్న ముఖ్యమంత్రి అవుతాడని” అందరికి చెప్పాలని జగన్ అన్నారు.

 

ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజలపై వరాల జల్లు కురిపించారు జగన్. ఇప్పటికే రూ. 1000 పింఛన్‌ను రూ.2000 చేశారు సీఎం చంద్రబాబు. తాజాగా జగన్ కూడా సంచలన హామీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వృద్ధులకు 3వేల రూపాయల ఫించన్ ఇస్తామని ప్రకటించారు. దేవుడి ఆశీస్సులతో వైసీపీ అధికారంలోకి వస్తే నెలకు రూ.3వేలు వృద్ధాప్య పింఛన్ ఇస్తామని జగన్ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ప్రతి అవ్వా, తాతకు ఈ విషయాన్ని చెప్పాలని.. నవ రత్నాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించేలా ఈ నవరత్నాలను రూపొందించామని.. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని జగన్ కోరారు.

 

వైసీపీ నవరత్నాల్లో వృద్ధాప్య ఫించన్‌ రూ.2 వేలు ఇస్తామని ఇప్పటికే జగన్ ప్రకటన చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తామని.. అలాగే వికలాంగులకు పింఛన్‌ రూ.3వేలు ఇస్తామని ప్రకటన చేశారు. 45ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కా చెల్లెమ్మలకు వైఎఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా రూ.75వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. తాను సీఎం కాగానే పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏటా రూ.15వేలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమని జగన్ జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags : ap electionscm chandrababucm jaganelection campaignpension incrimentsamara shankaravamTDPys jagan sensational promiseys jagan tirupati speechysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu