01/10/19 9:30 AM

13 కాదు 25 : జగన్ సంచలన ప్రకటన

YS Jagan Sensational Promise

ఏడాదికిపైగా సాగిన వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జనవరి 9వ తేదీ పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. సంచలన ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చాక వ్యవస్థను మారుస్తానని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని అన్నారు. 25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తానని చెప్పారు. పంచాయతీలను బలోపేతం చేస్తానని, కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేస్తానని చెప్పారు. ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం తీసుకు వస్తానని చెప్పారు. మీ గ్రామంలోనే యువతకు ఉద్యోగ అవకాశం ఇస్తామని ప్రకటించారు. ప్రతీ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి వెళ్లేలా చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో నడుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

2017లో ఇడుపులపాయలో మొదలైన యాత్రకు.. ఇచ్ఛాపురంలో ముగింపు పలికారు జగన్. పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురంలోని లొద్దపుట్టి దగ్గర ‘విజయ సంకల్పం’ పేరుతో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. 88 అడుగుల ఎత్తులో మూడంతస్తులుగా స్థూపం నిర్మించారు. స్థూపంలో 13 జిల్లాలకు చెందిన 13 మెట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మెట్టు ఒక్కో జిల్లాను సూచించేలా నిర్మాణం చేశారు. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల్లో 341 రోజులు పాటూ సాగిన యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల్లో.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జగన్. రైతులు, మహిళలు, యువతకు భరోసా కల్పిస్తూ రూపొందించిన ఏడు పథకాల ప్రాముఖ్యతను వివరించారు.

Tags : ap 25 districtsjagan padayatra endsjagan promiseprajasankalpa yatrays jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu